News May 10, 2024

నేటితో ముగియనున్న కేసీఆర్ ఎన్నికల ప్రచారం

image

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా BRS అధినేత KCR చేపట్టిన బస్సు యాత్ర ఇవాళ్టితో ముగియనుంది. నేడు సిద్దిపేటలో జరిగే సభతో ఆయన ఎన్నికల ప్రచారానికి ముగింపు పలకనున్నారు. 16 రోజులపాటు 13 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో KCR బస్సు యాత్ర కొనసాగింది. నేడు సిరిసిల్లలో జరిగే రోడ్ షో, సిద్దిపేటలో నిర్వహించనున్న బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. రేపు తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం.

Similar News

News December 25, 2024

తిరుమల పరకామణిలో కుంభకోణం?

image

AP: తిరుమల పరకామణిలో గతంలో రూ.కోట్లలో స్కామ్ జరిగిందని TTD ఛైర్మన్ BR నాయుడికి బోర్డు సభ్యుడు భాను‌ప్రకాశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. విదేశీ కరెన్సీ లెక్కింపులో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. 2023లో పరకామణిలో చోరీపై పెద్ద జీయంగార్ మఠం ఉద్యోగిపై కేసు నమోదైందని, ఆ కేసు తిరిగి విచారించాలన్నారు. నాడు పోలీసుల ఒత్తిడితో లోక్ అదాలత్‌లో రాజీ పడ్డామన్న విజిలెన్స్ అధికారుల నివేదికను ఆయన తప్పుబట్టారు.

News December 25, 2024

విచిత్రం: మగ టీచర్‌కు ప్రసూతి సెలవు మంజూరు

image

బిహార్ విద్యాశాఖలో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. వైశాలి జిల్లాకు చెందిన జితేంద్ర కుమార్ అనే మగ టీచర్ ప్రసూతి సెలవు కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా విచిత్రంగా ఆయనకు మంజూరయ్యాయి. దీంతో ఆయన 8 రోజులపాటు మెటర్నిటీ లీవ్‌లను ఎంజాయ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరలవడంతో అధికారులు స్పందించారు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరిగిందని చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామన్నారు.

News December 25, 2024

క్రీడా అవార్డుల్లో కేంద్రం వివక్ష: హర్వీందర్ సింగ్

image

ఖేల్‌రత్న అవార్డులకు నామినేట్ చేసే విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందన్న <<14970210>>మనూ భాకర్ తండ్రి విమర్శల<<>> నడుమ పారిస్ పారాలింపిక్స్ స్వర్ణ విజేత హర్వీందర్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. అవార్డుల విషయంలో కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. ‘టోక్యో పారాలింపిక్స్‌లో విజేతలకు ఖేల్ రత్న ఇచ్చారు. పారిస్ పారాలింపిక్స్‌లో విజేతలకు ఎందుకు ఇవ్వట్లేదు? ’ అని Xలో ప్రశ్నించారు.