News August 22, 2025
కేసీఆర్ పిటిషన్.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమన్న HC

TG: కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును రద్దు చేయాలని కేసీఆర్, హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది. పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని ఆదేశించింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. కాగా నివేదికపై అసెంబ్లీలో చర్చించాకే ముందుకెళ్తామని ఏజీ హైకోర్టుకు తెలిపారు.
Similar News
News August 22, 2025
సంచలనం.. చరిత్ర సృష్టించిన క్రికెటర్

వన్డేల్లో ఆడిన తొలి 4 మ్యాచ్‌ల్లో 50+ స్కోరు చేసిన ఏకైక క్రికెటర్‌గా సౌతాఫ్రికా ప్లేయర్ మాథ్యూ బ్రీట్జ్కే నిలిచారు. AUSతో జరుగుతున్న 2వ వన్డేలో 78 బంతుల్లో 88 రన్స్ చేసి ఈ ఘనత అందుకున్నారు. గతంలో భారత మాజీ ప్లేయర్ నవజ్యోత్ సింగ్ 5 వన్డేల్లో(3వ ODIలో బ్యాటింగ్ ఛాన్స్ రాలేదు) ఈ ఘనత సాధించారు. మాథ్యూ 4 వన్డేల్లో NZపై 150, PAKపై 83, AUSపై తొలి వన్డేలో 57, 2వ వన్డేలో 88 రన్స్‌తో రికార్డులకెక్కారు.
News August 22, 2025
లైసెన్స్ లేని కేబుళ్లన్నీ తీసేయండి: హైకోర్టు

TG: హైదరాబాద్‌లో కేబుళ్ల తొలగింపు నేపథ్యంలో ఎయిర్‌టెల్ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచవద్దని స్పష్టం చేశారు. ఇష్టానుసారంగా కేబుళ్లు ఏర్పాటు చేయడం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనన్నారు. కాగా ఇటీవల Dy.CM భట్టి ఆదేశాలతో HYDలో కేబుల్, ఇంటర్నెట్ వైర్లు కట్ చేసిన విషయం తెలిసిందే.
News August 22, 2025
కొరత సృష్టించిన వ్యాపారులపై చర్యలు: చంద్రబాబు

AP: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఎరువులు, పురుగు మందుల లభ్యత, సరఫరాపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి రావాల్సిన వాటా వచ్చినా కొరత ఎక్కడ ఉందో గుర్తించాలని ఆదేశించారు. కృత్రిమ కొరత సృష్టించినా, దారి మళ్లించినా వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం దిశా నిర్దేశం చేశారు.