News March 17, 2024

కేసీఆర్‌కు ఝలకిచ్చే ప్లాన్!

image

కాంగ్రెస్‌లో BRSLP విలీనం దిశగా సీఎం రేవంత్ అడుగులు వేస్తున్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. చట్టపరంగా 26 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే BRS పక్షాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోవచ్చు. ఇప్పటికే ఎమ్మెల్యే దానం ఆ పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో 25 మంది ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. తద్వారా బీఆర్ఎస్‌ను చావుదెబ్బ కొట్టడమే కాంగ్రెస్ వ్యూహంగా తెలుస్తోంది.

Similar News

News September 30, 2024

‘టాక్సీవాలా’ డైరెక్టర్‌తో విజయ్ సినిమా.. షూట్ ఎప్పుడంటే?

image

విజయ్ దేవరకొండ, ‘టాక్సీవాలా’ సినిమా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనుంది. 1854-1878 కాలంలో ఈ మూవీ కథ జరుగుతుందని, అక్టోబర్‌లో లేదా నవంబర్ తొలి వారంలో షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇందులో విజయ్ తండ్రీకొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.

News September 30, 2024

తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

image

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని, ఇందుకోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని BJP సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేశారు. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

News September 30, 2024

జయసూర్య వచ్చాడు.. జయాలు తెచ్చాడు!

image

గత కొన్నేళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న శ్రీలంక క్రికెట్ టీమ్ ఇప్పుడు వరుస విజయాలు నమోదు చేస్తోంది. ఈ క్రెడిట్ సనత్ జయసూర్యదేనని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఆయన తాత్కాలిక హెడ్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి ఆ జట్టు INDపై ODI సిరీస్, ENGలో ENGపై టెస్టు మ్యాచ్, తాజాగా NZపై టెస్ట్ సిరీస్ గెలిచింది. దీంతో ఆ దేశ క్రికెట్‌లో కొత్త శకం మొదలైందని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.