News February 27, 2025
మే 2న కేదార్నాథ్ ఆలయం ఓపెన్

చార్ధామ్ యాత్రలో కీలకమైన కేదార్నాథ్ ఆలయాన్ని మే 2న ఉదయం 7 గంటలకు తెరవనున్నట్లు ఆలయ కమిటీ అధికారి విజయ్ ప్రసాద్ తెలిపారు. దీంతోపాటు ఉత్తరాఖండ్లోని గర్వాల్ హిమాలయాల్లో ఉన్న గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఏప్రిల్ 30న, బద్రీనాథ్ గుడిని మే 4న తెరవనున్నారు. ఈ నాలుగు ఆలయాలను కలిపి చార్ధామ్గా పిలుస్తారు. మంచు, విపరీతమైన చలి కారణంగా ఈ ఆలయాలను సంవత్సరంలో కొన్ని నెలలే తెరుస్తారు.
Similar News
News February 27, 2025
ముగిసిన వంశీ కస్టడీ

AP: వైసీసీ నేత వల్లభనేని వంశీ మూడోరోజు పోలీస్ కస్టడీ ముగిసింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపు కేసులో వంశీని పోలీసులు 3 రోజుల పాటు ప్రశ్నించారు. వంశీతో పాటు లక్ష్మీపతి, శివరామకృష్ణను విచారించారు. వంశీని మరోసారి కస్టడీకి తీసుకోవాలనే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. దీనిపై త్వరలోనే కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
News February 27, 2025
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్

ఏపీ, తెలంగాణలో MLC ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇరు రాష్ట్రాల్లో 3 చొప్పున స్థానాలకు ఉ.8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. TGలో ఉమ్మడి MDK-NZB-ADB-KNR గ్రాడ్యుయేట్, టీచర్, ఉమ్మడి WGL-KMM-NLGలో టీచర్ MLC స్థానానికి, APలో ఉమ్మడి గుంటూరు-కృష్ణా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరిగింది. మార్చి 3న కౌంటింగ్ జరగనుంది.
News February 27, 2025
మహిళల రక్షణలో సమాజానికీ బాధ్యత ఉంది: జస్టిస్ చంద్రచూడ్

పుణేలోని బస్సులో యువతిపై జరిగిన <<15593054>>అత్యాచారంపై<<>> మాజీ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పందించారు. కేవలం చట్టాలతోనే దురాగతాలను నివారించలేమని అభిప్రాయపడ్డారు. ఆ చట్టాలను సక్రమంగా అమలు చేయాల్సి ఉందన్నారు. ఎక్కడికెళ్లినా తాము సురక్షితంగా ఉన్నామనే నమ్మకాన్ని మహిళల్లో కలిగించాలని తెలిపారు. ఈ విషయంలో న్యాయవ్యవస్థ, పోలీసులతోపాటు సమాజానికీ బాధ్యత ఉందని పేర్కొన్నారు.