News September 24, 2024

కీచక ప్రిన్సిపల్.. చిన్నారిని చంపి స్కూల్‌లోనే పాతిపెట్టి..

image

గుజరాత్‌లోని దాహోద్‌లో ఘోరం జరిగింది. ప్రిన్సిపల్ గోవింద్ నట్(55) ఓ విద్యార్థిని(6)ని స్కూల్‌కు తీసుకెళ్లేందుకు చిన్నారి ఇంటి వద్ద కారులో ఎక్కించుకున్నాడు. అత్యాచారానికి ప్రయత్నించగా చిన్నారి ప్రతిఘటించింది. దీంతో ఆమెను ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. డెడ్‌బాడీని కారులోనే ఉంచి స్కూల్‌కి వెళ్లాడు. సాయంత్రం పాఠశాల ప్రాంగణంలో పాతిపెట్టాడు. దర్యాప్తులో నేరం ఒప్పుకోకపోయినా ఫోన్ లొకేషన్‌తో నిజం బయటపడింది.

Similar News

News January 28, 2026

గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరి కోసం తినాలా?

image

చాలామంది పెద్దవాళ్లు గర్భవతి ఇద్దరి కోసం తినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోవడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అలాగే కొందరు ప్రెగ్నెన్సీలో అసలు బరువే పెరగకపోవచ్చు. అది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

News January 28, 2026

కేంద్ర సంస్కృత యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

ఢిల్లీలోని <>కేంద్ర<<>> సంస్కృత యూనివర్సిటీ 43 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడదల చేసింది. కాలేజీ లైబ్రేరియన్, సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్, UDC, LDC పోస్టులు ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 27 వరకు అప్లై చేసుకోవచ్చు. త్వరలో పూర్తి స్థాయి నోటిఫికేషన్ విడుదల కానుంది. వెబ్‌సైట్: https://sanskrit.nic.in/

News January 28, 2026

వేరుశనగలో ఇనుపధాతు లోపం – నివారణ

image

చలి కారణంగా వేరుశనగలో ఈ సమయంలో ఇనుపధాతు లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. దీని వల్ల లేత ఆకులు పసుపు పచ్చగా, తర్వాత తెలుపు రంగులోకి మారతాయి. ఈ లోపాన్ని అధిగమించడానికి ఎకరాకు 200 లీటర్ల నీటిలో 1 కిలో అన్నభేధి మరియు 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని కలిపి రెండు సార్లు పిచికారీ చేయాలి. ఈ సమస్యను సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకుంటే మొక్కల పెరుగుదలపై ప్రభావం పడే అవకాశం ఉంది.