News September 30, 2024
దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి: సుప్రీం

AP: తిరుమల లడ్డూ కల్తీ జరిగిందన్న రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘మైసూర్/ ఘజియాబాద్ ల్యాబ్ల నుంచి ఎందుకు ఒపీనియన్ తీసుకోలేదు? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు సేకరించలేదు? ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు? కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు చూపండి. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.
Similar News
News November 28, 2025
KNR: శిశుగృహ, బాలసదనం నుంచి పిల్లల దత్తత

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ శిశు గృహంలో పెరుగుతున్న 4నెలల వయసున్న ఆడ శిశువును హుస్నాబాద్కు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న 13సం.ల బాలికను తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా దంపతులకు పిల్లలను దత్తత ఇచ్చారు.
News November 28, 2025
వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న ప్రకాశం కలెక్టర్

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతంచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ చెప్పారు. గురువారం ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా ఇప్పటివరకు వచ్చిన పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పరిస్థితిని కలెక్టర్ రాజాబాబు వివరించారు. ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసినట్లు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉందన్నారు.
News November 28, 2025
ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

జిల్లాలో ఇసుక కొరత లేకుండా సామాన్యులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన కలెక్టర్, సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహించి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.


