News January 3, 2025
ఇంటర్ నుంచే అతడితో డేటింగ్: కీర్తి సురేశ్

తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో ఇంటర్ నుంచే డేటింగ్ చేసినట్లు హీరోయిన్ కీర్తి సురేశ్ తెలిపారు. ఆయన ఖతర్‌లో ఉన్నా తమ ప్రేమ విడిపోలేదని చెప్పారు. ‘తట్టిల్ నాకన్నా ఏడేళ్లు పెద్దవాడు. దాదాపు 12 ఏళ్లు మేమిద్దరం ప్రేమించుకున్నాం. పెళ్లి విషయం మా నాన్నతో చెప్పగానే వెంటనే అంగీకరించారు. ఇద్దరి ఆచార, సంప్రదాయల ప్రకారం వివాహం చేయాలని ఆయనే డిసైడ్ చేశారు. పెళ్లి చేసుకుని నా కల నెరవేర్చుకున్నా’ అని చెప్పుకొచ్చారు.
Similar News
News December 2, 2025
ఈ సారి చలి ఎక్కువే: IMD

దేశంలో ఈ శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. మధ్య, వాయవ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు ఎక్కువగా వీస్తాయని అంచనా వేసింది. హరియాణా, రాజస్థాన్, ఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఆయా రాష్ట్రాల్లో 4-5 రోజులు ఎక్కువగా కోల్డ్ వేవ్స్ ఉంటాయని చెప్పింది. కాగా దేశంలో ఇప్పటికే చలి పెరిగిపోయింది.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని CSIR-<
News December 2, 2025
దూడలకు వ్యాధినిరోధక టీకాలు ఎప్పుడు వేయించాలి?

☛ 6 నుంచి 8 వారాల వయసులో తొలిసారి గాలికుంటు వ్యాధి టీకా వేయించాలి. తర్వాత 3 నెలల్లో బూస్టర్ డోస్ ఇవ్వాలి.
☛ 4 నెలల వయసులో(ముఖ్యంగా సంకర జాతి దూడలకు) థైలీరియాసిస్ టీకా వేయించాలి.
☛ 6 నెలల వయసు దాటాక గొంతువాపు వ్యాధి రాకుండా టీకా వేయించాలి. ☛ 6- 12 నెలల వయసులో గొంతువాపు వ్యాధి టీకా వేయించిన 15-20 రోజుల తర్వాత జబ్బవాపు రాకుండా టీకా వేయించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు.


