News December 6, 2024

పెళ్లి కోసం గోవాకు చేరుకున్న కీర్తి సురేశ్

image

నటి కీర్తి సురేశ్ వివాహం ఈ నెల 12న గోవాలో జరగనున్న సంగతి తెలిసిందే. ఆ వేడుకకోసం ఆమె కుటుంబీకులతో కలిసి తాజాగా గోవాకు చేరుకున్నారు. ఈ విషయాన్ని కీర్తి తన ఇన్‌స్టాలో వెల్లడించారు. ‘మొదలైంది’ అన్న క్యాప్షన్‌తో ‘KA వెడ్డింగ్’ హాష్‌ట్యాగ్ ఇచ్చారు. చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ను ఆమె పెళ్లి చేసుకోనున్నారు. కొచ్చికి చెందిన తట్టిల్‌కు ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాపారాలున్నాయి.

Similar News

News November 22, 2025

లేబర్ కోడ్స్‌పై మండిపడ్డ కార్మిక సంఘాలు

image

కేంద్రం అమల్లోకి తెచ్చిన 4 <<18350734>>లేబర్ కోడ్స్‌<<>>ను కార్మిక సంఘాలు ఖండించాయి. కార్మికులకు నష్టం కలిగించేలా, కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని 10 లేబర్ యూనియన్లు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ‘ఇది అత్యంత అప్రజాస్వామిక చర్య. శ్రామికులపై యుద్ధం ప్రకటించడం తప్ప మరేమీ కాదు. పెట్టుబడిదారులతో ప్రభుత్వం కుమ్మక్కైంది’ అని మండిపడ్డాయి. లేబర్ కోడ్స్‌ను విత్ డ్రా చేసుకునే దాకా తాము పోరాటం చేస్తామని ప్రకటించాయి.

News November 22, 2025

20 ఏళ్ల తర్వాత కీలక శాఖ వదులుకున్న నితీశ్

image

కొత్తగా కొలువుదీరిన బిహార్ క్యాబినెట్‌లో మంత్రులకు శాఖల కేటాయింపులు పూర్తయ్యాయి. 20 ఏళ్లుగా తన వద్దే ఉంచుకున్న కీలకమైన హోం శాఖను సీఎం నితీశ్ కుమార్ వదులుకున్నారు. డిప్యూటీ సీఎం చౌధరి(BJP)కి ఇచ్చారు. మరో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా(BJP)కు రెవెన్యూ, గనుల శాఖలు కేటాయించారు. సాధారణ పరిపాలన, విజిలెన్స్ వంటి శాఖలు మాత్రమే నితీశ్ తన వద్ద ఉంచుకున్నారు.

News November 22, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.