News December 11, 2024
రాహుల్‌పై కేజ్రీకి అపనమ్మకమా? లేదా ఓడిపోతామన్న భయమా?

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుకు అవకాశం లేదన్న అరవింద్ <<14847113>>కేజ్రీవాల్<<>> ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. గెలిచే రాష్ట్రాలనూ పోగొట్టుకొనే కాంగ్రెస్‌తో కలిస్తే ఓటమి తప్పదేమోనని ఆప్ భయపడుతోందని విశ్లేషకులు అంటున్నారు. మహారాష్ట్ర, హరియాణాల్లో ఘోర ఓటమి, JK, ఝార్ఖండ్‌లో ఆశించిన ప్రభావం చూపకపోవడంతో రాహుల్‌పై ఇండియా కూటమి నేతలు విశ్వాస రాహిత్యంతో ఉన్నారని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు?
Similar News
News October 15, 2025
పప్పులో కాలేసిన ఇన్వెస్టర్లు.. LG అనుకొని!

దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ‘LG ఎలక్ట్రానిక్స్’ స్టాక్‌మార్కెట్‌లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇన్వెస్టర్లు షేర్లు కొనేందుకు ఎగబడ్డారు. అయితే చాలామంది సరైన కంపెనీని సెర్చ్ చేయకుండా పప్పులో కాలేశారు. LG ఎలక్ట్రానిక్స్‌కి బదులు పొరపాటున LG బాలకృష్ణన్ & బ్రదర్స్ లిమిటెడ్ షేర్లు కొనేశారు. దీంతో ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా 20% పెరిగిపోయినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
News October 15, 2025
రేపు ఏపీలో పర్యటిస్తున్నా: మోదీ

గురువారం ఏపీలో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముందుగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. అంతకుముందు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే.
News October 15, 2025
ఇతిహాసాలు క్విజ్ – 36 సమాధానాలు

1. దశరథుడి తల్లి ఇందుమతి.
2. పాండవులు ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో ఉంటారు.
3. విష్ణువు ధనస్సు పేరు ‘సారంగం’.
4. తెలంగాణలోని భద్రాచలం ఆలయం గోదావరి నది ఒడ్డున ఉంది.
5. శుక అంటే చిలుక అని అర్థం.
<<-se>>#Ithihasaluquiz<<>>