News March 23, 2024
హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

లిక్కర్ స్కాం కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ CM కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అత్యవసర విచారణ జరపాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. కాగా లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోర్టు ఆయనకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది.
Similar News
News November 7, 2025
హనుమాన్ చాలీసా భావం – 2

రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా ||
ఇది ఆంజనేయుడి గొప్పదనాన్ని వివరిస్తుంది. హనుమాన్ రాముడికి నమ్మకమైన దూత(రామదూత). ఆయన బలం కొలవలేనిది, అపార శక్తిమంతుడు(అతులిత బలధామా). ఆయన అంజనీదేవి కుమారుడు(అంజనిపుత్ర), వాయుదేవుని పుత్రుడు(పవనసుత). శ్రీరాముడి విజయం, ధర్మ స్థాపనలో హనుమంతుని పాత్ర కీలకం. ఆయనను స్మరిస్తే శక్తి, విజయం లభిస్తాయి. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 7, 2025
హెయిర్ డై వేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

ఒక్క తెల్లవెంట్రుక కనబడగానే కంగారు పడిపోయి జుట్టుకు రంగులువేస్తుంటారు చాలామంది. అయితే హెయిర్ డై వేసేటపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఇన్స్టాంట్ కలర్ ఇచ్చే బ్లాక్ హెన్నా, షాంపూల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. సల్ఫేట్లు, అమోనియా పెరాక్సైడ్, PPD లేనివి ఎంచుకోవాలి. తలస్నానం చేసి కండిషనర్ రాశాకే రంగు వేయాలి. ముఖానికి, మాడుకు మాయిశ్చరైజర్ రాసి, తర్వాత డై వేసుకోవాలని సూచిస్తున్నారు.
News November 7, 2025
కోహ్లీ, బాబర్‌కు తేడా అదే: పాక్ క్రికెటర్

పాకిస్థాన్ క్రికెట్‌పై బాబర్ ఆజమ్ ఎంతో ప్రభావం చూపారని ఆ దేశ క్రికెటర్ ఆజం ఖాన్ అన్నారు. ‘బౌలింగ్‌కు పేరుగాంచిన పాకిస్థాన్‌ను బ్యాటింగ్ విషయంలో బాబర్ ఫేమస్ చేశారు. అచ్చం ఇండియా కోసం కోహ్లీ చేసినట్లే. అయితే కోహ్లీ కెరీర్ ప్రారంభంలో సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, సెహ్వాగ్, ధోనీ వంటి లెజెండ్స్ ఉన్నారు. కానీ బాబర్‌కు ఎవరున్నారు? అతడు ఎంతో భారం మోయాల్సి వచ్చింది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


