News July 1, 2024
హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనను CBI అరెస్టు చేయడం, రిమాండ్‌కు పంపడాన్ని సవాల్ చేస్తూ CM కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇదే కేసులో తిహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్‌ను CBI అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా తొలుత 3రోజుల రిమాండ్ విధించింది. విచారణకు మరో 14 రోజులు కావాలని CBI కోరడంతో జుడీషియల్ కస్టడీని జులై 12 వరకు కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.
Similar News
News January 18, 2026
భారీ జీతంతో కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

<
News January 18, 2026
జగన్ రాజధాని కామెంట్లకు CM CBN కౌంటర్

AP: సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని జగన్ చేసిన కామెంట్లకు CM చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఆయన బెంగళూరులో ఉంటే బెంగళూరు, ఇడుపులపాయలో ఉంటే అదే రాజధాని అవుతుందా అని ప్రశ్నించారు. 5ఏళ్లు ఏపీ రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితిలో వైసీపీ పాలన సాగిందని విమర్శించారు. 3 రాజధానులు అని చెప్పిన ప్రాంతాల్లో కూడా NDA అభ్యర్థులు విజయం సాధించారని గుర్తుచేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని CBN పేర్కొన్నారు.
News January 18, 2026
ఇండియాకు mitc‘Hell’ చూపిస్తున్నాడు..

భారత బౌలర్లకు న్యూజిలాండ్ ప్లేయర్ మిచెల్ చుక్కలు చూపిస్తున్నారు. గత మ్యాచులో సెంచరీతో చెలరేగిన ఈ ప్లేయర్ మూడో వన్డేలోనూ అర్ధశతకం బాదారు. 56 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. ఈ సిరీస్‌లో అతడికి ఇది మూడో 50+ స్కోరు కావడం గమనార్హం. ఓవరాల్‌గా వన్డేల్లో భారత్‌పై 11 ఇన్నింగ్సుల్లో 600+ రన్స్ చేయగా ఆరు సార్లు 50+కి పైగా పరుగులు చేశారు. అద్భుతమైన ఫామ్‌తో ODI ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్నారు.


