News March 27, 2024
సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్?

లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ రేపటితో ముగియనున్న నేపథ్యంలో CBI ఆయన కస్టడీని కోరనున్నట్లు తెలుస్తోంది. రేపు కోర్టు విచారణ సందర్భంగా సీబీఐ ఈ మేరకు విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈనెల 21న కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన ఈడీ ఈ కేసుపై విచారిస్తోంది. మరోవైపు తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ చేపడుతోంది.
Similar News
News March 9, 2026
BREAKING: భారీగా తగ్గిన బంగారం ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా పడిపోయింది. 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,960 తగ్గి రూ.1,61,680కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,800 పతనమై రూ.1,48,200 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 9, 2026
త్రిషకు సారీ చెప్పిన నటుడు పార్తీబన్

త్రిషను బయటకు రానివ్వకూడదంటూ తాను చేసిన <<19330179>>కామెంట్స్‌పై<<>> నటుడు, డైరెక్టర్ పార్తీబన్ విచారం వ్యక్తం చేశారు. ‘ఈవెంట్‌లో అంతా తప్పుగా జరిగింది. క్షమాపణ కోరడం తప్ప మరో మార్గం లేదు’ అని Xలో పోస్టు చేశారు. టీవీకే చీఫ్ విజయ్, త్రిష రిలేషన్ రూమర్స్ నేపథ్యంలో పార్తీబన్ చేసిన కామెంట్స్ వైరలైన విషయం తెలిసిందే. దీనిపై త్రిష కూడా <<19332584>>ఘాటుగా బదులివ్వడంతో<<>> ఆయన దిగి వచ్చారు.
News March 9, 2026
భారీ నష్టం తప్పదు.. ఇరాన్‌కు వార్నింగ్ ఇచ్చిన గల్ఫ్ దేశాలు

తమపై దాడులు చేస్తోన్న ఇరాన్‌పై గల్ఫ్ దేశాలు ఫైరవుతున్నాయి. అరబ్ దేశాలపై అటాక్స్ కొనసాగిస్తే టెహ్రాన్ భారీ నష్టాన్ని చవిచూస్తుందని సౌదీ హెచ్చరించింది. దీనివల్ల భవిష్యత్తులో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం పడుతుందని తెలిపింది. అతి పెద్ద షైబా ఆయిల్ ఫీల్డ్‌పై దాడిని ఖండించింది. ఇరాన్ తమను మోసం చేసిందని ఖతర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దాడులు చేయట్లేదని చెబుతూ డ్రోన్లతో విరుచుకుపడుతోందని మండిపడింది.


