News January 14, 2025

మోదీని కేజ్రీవాల్ ఫాలో అవుతున్నారు: రాహుల్

image

ఢిల్లీలో అవినీతి, ద్ర‌వ్యోల్బ‌ణం పెరుగుతున్నా ప్ర‌ధాని మోదీ త‌ర‌హాలో కేజ్రీవాల్ కూడా ప్రచారం, అబ‌ద్ధపు హామీల విధానాన్ని అనుసరిస్తున్నారని రాహుల్ గాంధీ దుయ్య‌బ‌ట్టారు. ఢిల్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా పార్టీ నేత‌ల‌కు రాహుల్‌ దిశానిర్దేశం చేశారు. ఆప్‌పై శాయ‌శ‌క్తులా పోరాడాల‌ని, వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపాల‌ని, అధికార పార్టీకి గ‌ట్టి పోటీ ఇవ్వాల‌న్నారు. మరోవైపు 2020లో కాంగ్రెస్ ఢిల్లీలో ఒక్క సీటూ గెలవలేదు.

Similar News

News January 15, 2025

క్యాన్సర్ నుంచి కోలుకుంటున్నా: యువరాణి కేట్

image

బ్రిటన్ యువరాజు విలియమ్ భార్య, ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేట్ మిడిల్టన్ తాను కాన్సర్ నుంచి బయటపడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పుడు కాస్త రిలీఫ్‌గా ఉందని పూర్తిగా కోలుకోవడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. గత ఏడాది క్యాన్సర్ బారిన పడినట్లు ప్రకటించిన కేట్ కొంతకాలంగా చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.

News January 15, 2025

ఇది వెంకీ సార్ పొంగల్: అనిల్ రావిపూడి

image

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు వస్తున్న స్పందన ఆనందం కలిగిస్తోందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. మూవీ సక్సెస్ వేడుకల్లో ఆయన మాట్లాడారు. వెంకటేశ్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకోవాలో తెలుసని, ఈ సంక్రాంతికి సరిగ్గా కుదిరిందని చెప్పారు. బెనిఫిట్ షోలకు ఫ్యామిలీస్ రావడం పెద్ద అచీవ్‌మెంట్ అని తెలిపారు. ఇది వెంకీ సార్ పొంగల్ అని పేర్కొన్నారు. సినిమాకు సపోర్ట్ చేసినవారికి ధన్యవాదాలు తెలిపారు.

News January 15, 2025

ఈరోజు ప్రయాణాలు చేస్తున్నారా?

image

‘కనుమ నాడు కాకులు కూడా కదలవు’ అనేది సామెత. ఇవాళ ఎలాంటి ప్రయాణాలు చేయకూడదని పెద్దలు చెబుతారు. దీనికి కారణం పూర్వం ఎడ్ల బండ్ల మీదే ప్రయాణాలు జరిగేవి. కనుమ రోజున పశువులను పూజించి ఏడాదిలో ఈ ఒక్కరోజైనా వాటిని కష్టపెట్టకుండా బండ్లు కట్టొద్దని నిర్ణయించారు. అందుకే ఈరోజున ప్రయాణాలు చేయొద్దని అంటారు.