News March 28, 2024
స్వయంగా వాదనలు వినిపిస్తున్న కేజ్రీవాల్

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన సీఎం కేజ్రీవాల్ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో స్వయంగా వాదనలు వినిపిస్తున్నారు. ‘రెండేళ్ల క్రితం నుంచి ఈ కేసు నడుస్తోంది. 2022 ఆగస్టులో సీబీఐ కేసు నమోదైంది. నాపై ఆరోపణలు లేకున్నా అరెస్టు చేశారు’ అని చెబుతుండగా జడ్జి కావేరీ బవేజా ‘మీ వాదనలను రాతపూర్వకంగా ఇవ్వండి’ అని అడిగారు. దీనికి స్పందించిన కేజ్రీవాల్ ‘కాసేపు మాట్లాడనివ్వండి మేడమ్’ అని వాదనలు కొనసాగిస్తున్నారు.
Similar News
News November 20, 2025
KTRను ప్రాసిక్యూట్ చేసేందుకు పర్మిషన్.. వివరాలు ఇవే!

TG: ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లు ACB గతంలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. రూ.54.88 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ 4 సార్లు ACB విచారణకు హాజరయ్యారు. డాక్యుమెంట్లు, ఈమెయిల్స్, ఎలక్ట్రానిక్ రికార్డులు కలెక్ట్ చేసింది. దీనిపై KTRను ప్రాసిక్యూట్ చేసేందుకు సెప్టెంబర్లో ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరగా ఇప్పుడు <<18337628>>పర్మిషన్<<>> ఇచ్చారు.
News November 20, 2025
‘వారణాసి’ కథ ఇదేనా?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’కి సంబంధించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. కథ ఇదేనంటూ ‘Letterboxd’లో పోస్ట్ చేసిన synopsis వైరల్ అవుతోంది. ‘వారణాసిని ఒక గ్రహశకలం ఢీకొన్నప్పుడు అది ఎలాంటి ఘటనలకు దారి తీస్తుంది. ప్రపంచం నాశనం అవుతుందా? దీన్ని ఆపేందుకు ఖండాలు, కాలక్రమాలను దాటాల్సిన రక్షకుడు అవసరమా?’ అని అందులో ఉంది. ఈ టైమ్ ట్రావెల్ కథలో మహేశ్ 2 పాత్రల్లో కనిపిస్తారని చర్చ సాగుతోంది.
News November 20, 2025
HALలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (<


