News March 25, 2024
కేజ్రీవాల్ అంటే ప్రధానికి భయం: సంజయ్ రౌత్

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటే ప్రధాని మోదీకి భయమని, అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని శివసేన(ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. అరెస్ట్ తర్వాత కేజ్రీవాల్ మరింత బలంగా మారారని అన్నారు. రాజకీయ నాయకులను భయపెట్టేందుకు, ప్రతిపక్షాలను నిర్మూలించేందుకు మోదీ దర్యాప్తు సంస్థలను వాడుకుంటున్నారని విమర్శించారు. మార్చి 31న చేపట్టే విపక్షాల ర్యాలీలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News January 25, 2026
ఫిల్మ్ ఇండస్ట్రీలో మత పక్షపాతం లేదు: అరుణ్ గోవిల్

ఫిల్మ్ ఇండస్ట్రీలో మత పక్షపాతం లేదని ‘రామాయణ’ సీరియల్ నటుడు అరుణ్ గోవిల్ అన్నారు. ఒకవేళ అది ఉండుంటే సల్మాన్, షారుఖ్, ఆమీర్ లాంటి ముస్లిం యాక్టర్లు స్టార్లు అయ్యేవారు కాదని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. తనకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయని, దీనికి మతం కూడా కారణం కావొచ్చని మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల పేర్కొనడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అరుణ్ గోవిల్ స్పందించారు.
News January 25, 2026
Super 5: మీ ప్లేట్‌లో ఉండాల్సిన టాప్ వెజ్జీస్

ఆరోగ్యంగా ఉండాలంటే కూరగాయలు తినడం చాలా ముఖ్యం. ఈ 5 వెజ్జీస్ మీ డైట్‌లో ఉంటే అదిరిపోయే హెల్త్ మీ సొంతమని న్యూట్రిషనిస్ట్ లోవ్నీత్ బాత్రా అంటున్నారు. రక్తం పెరగడానికి పాలకూర (Iron), కంటి చూపు కోసం క్యారెట్ (Vitamin A), రోగనిరోధక శక్తికి రెడ్ క్యాప్సికమ్ (Vitamin C) బాగా పనిచేస్తాయి. అలాగే బీట్‌రూట్ ద్వారా Folate, అరుగుదల పెంచేందుకు కాలీఫ్లవర్ నుంచి డైటరీ ఫైబర్ అందుతాయి.
News January 25, 2026
ఫిబ్రవరి 11 నుంచి ఏపీ అసెంబ్లీ!

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ఫిబ్రవరి 14న బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 18 నుంచి 21 రోజులు సభ నిర్వహించాలని భావిస్తోంది. మార్చి రెండో వారం వరకు కొనసాగే అవకాశం ఉందని సమాచారం. తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. అదే రోజు శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం కానుంది.


