News March 22, 2024
ఈడీ అధికారులపై కేజ్రీవాల్ నిఘా?

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఇంట్లో సోదాలు చేస్తుండగా దాదాపు 150 పేజీల డాక్యుమెంట్ దొరికినట్లు తెలుస్తోంది. ఇందులో ఈడీ స్పెషల్ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్ హోదాలో ఉన్న ఇద్దరు అధికారుల సమగ్ర వివరాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ అధికారులపై కేజ్రీవాల్ నిఘా ఉంచారేమోనని ఈడీ అనుమానిస్తోందట.
Similar News
News April 19, 2025
ఫార్ములా ఈ-రేసు కేసు.. రెండో విడత దర్యాప్తు!

TG: ఫార్ములా ఈ-రేసు కేసులో రెండో విడత దర్యాప్తు కోసం ఏసీబీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్ సహా 24 మంది స్టేట్మెంట్లు రికార్డు చేసిన అధికారులు, మరో 10 మందికి నోటీసులిచ్చి ప్రశ్నించాలని నిర్ణయించారు. HMDA బోర్డు నిధుల నుంచి రూ.55 కోట్లు విదేశీ సంస్థకు అక్రమంగా చెల్లించారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
News April 19, 2025
JEE మెయిన్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు ఎవరంటే?

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాల్లో 24 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్ రాగా, వారిలో నలుగురు తెలుగువారు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన హర్ష గుప్తాకు 8, అజయ్ రెడ్డికి 16(ఆలిండియా ఈడబ్ల్యూఎస్ కోటా మొదటి ర్యాంక్), బనిబ్రత మజీకి 24వ ర్యాంక్ వచ్చింది. అలాగే ఏపీకి చెందిన సాయి మనోజ్ఞ ఆలిండియా 22వ ర్యాంకుతో పాటు బాలికల్లో 2వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.
News April 19, 2025
సమ్మర్లో ఎలాంటి దుస్తులు వేసుకోవాలంటే?

వేసవికాలంలో ఎండల దెబ్బకు శరీరం చెమటతో తడిసిముద్దవుతుంది. దీని నుంచి రిలీఫ్ కావాలంటే కొన్ని రకాల దుస్తులు ధరించాలని నిపుణులు చెబుతున్నారు. బయటకు వెళ్లినప్పుడు కాటన్తో కూడిన లూజ్ బట్టలు ధరించాలి. వీటి వల్ల చెమట ఈజీగా బయటకు వస్తుంది. ఇంట్లో ఉంటే షార్ట్స్, స్లీవ్ లెస్ టీషర్ట్స్ ధరించవచ్చు. లేత రంగుల దుస్తులు ధరించాలి. బ్లాక్, బ్లూ, రెడ్ వంటి రంగుల దుస్తులు వేసుకుంటే వేడిని గ్రహించి అలసిపోతారు.