News June 23, 2024

సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇటీవల ఆయనకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనిపై ఈడీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లడంతో న్యాయస్థానం బెయిల్‌పై స్టే విధించింది. బెయిల్‌పై విచారణ ముగిసేవరకు కేజ్రీవాల్‌ను విడుదల చేయొద్దని సూచించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ తాజాగా సుప్రీంకోర్టుకు వెళ్లిన ఆయన రేపు విచారణ చేపట్టాలని కోరారు.

Similar News

News February 7, 2026

రికార్డ్ సృష్టించిన ప్రభాస్.. జపాన్ మ్యాగజైన్‌పై సోలో ఫొటో

image

రెబల్ స్టార్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించారు. జపాన్‌కు చెందిన పాపులర్ లైఫ్‌స్టైల్ వీక్లీ మ్యాగజైన్ ‘Anan’ ఫిబ్రవరి ఎడిషన్‌ బ్యాక్ కవర్‌పై సోలోగా కనిపించిన తొలి భారతీయ నటుడిగా చరిత్ర సృష్టించారు. ‘బాహుబలి’ సినిమా తర్వాత జపాన్‌లో ఏర్పడిన భారీ ఫ్యాన్‌బేస్‌కు ఇది నిదర్శనంగా నిలిచింది. గతంలో ‘RRR’ సక్సెస్ తర్వాత 2023లో రామ్‌చరణ్, NTR కలిసి కవర్‌పై కనిపించగా, ఈసారి ప్రభాస్ సోలోగా మెరిశారు.

News February 7, 2026

ఈ 3 దేశాల్లో ఇంటర్నెట్ ఉన్నా లేనట్టే!

image

EAలోని ఎరిట్రియా, N.కొరియా, CAలోని తుర్క్‌మెనిస్తాన్‌ దేశాల్లో ఇంటర్నెట్ లిమిటెడ్‌గా ఉంటుంది. భద్రతా కారణాలతో టెలికాంలపై ఎరిట్రియా, N.కొరియా ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఎరిట్రియాలో ప్రభుత్వ పర్యవేక్షణలోని కెఫేలపై పౌరులు ఆధారపడతారు. నా.కొరియాలో SM వాడటంపై నిషేధం. తుర్క్‌మెనిస్తాన్‌లో SM, వార్తలు, ఫారిన్ సైట్స్‌ను ప్రభుత్వం బ్యాన్ చేసింది. VPNల సపోర్ట్‌తో వాడుతున్నా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

News February 7, 2026

ఇస్లామాబాద్‌లో దాడి చేసింది మేమే: ఐసిస్

image

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరిగిన <<19072203>>ఆత్మాహుతి దాడి <<>>తమ పనేనని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ప్రకటించింది. ‘మసీదులోకి వెళ్లేందుకు యత్నించిన మా ఫైటర్‌ను గార్డులు అడ్డుకున్నారు. దీంతో ప్రజలు గుమిగూడిన చోట అతడు తనను తాను పేల్చేసుకున్నాడు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అటాక్ చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామని పాక్ PM షరీఫ్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని ఓడించాలనే తమ సంకల్పానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.