News July 14, 2024
8.5 కేజీలు తగ్గిన కేజ్రీవాల్.. ఆరోగ్యానికి పెనుముప్పు: అతీశీ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలులో ఉన్న CM కేజ్రీవాల్ ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం పొంచి ఉందని ఆప్ మంత్రి అతీశీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన షుగర్ లెవెల్స్ 50 కంటే తక్కువకు పడిపోయాయని, బరువు 8.5KGలు తగ్గిపోయారని చెప్పారు. ‘జైలులో ఉన్న ఆప్ చీఫ్కు సరైన వైద్యం అందడం లేదు. ఆయన స్ట్రోక్, బ్రెయిన్ డ్యామేజీకి గురైతే ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ పరిస్థితిపై డాక్టర్లను సంప్రదిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
Similar News
News December 6, 2025
హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్లో పోస్టులు

హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్(<
News December 6, 2025
రబీ వరి నారుమడిలో సస్యరక్షణ ఎలా?

వరి నారు పీకడానికి వారం రోజుల ముందు 5 సెంట్ల నారుమడికి 800 గ్రా. కార్బోఫ్యూరాన్ 3జి గుళికలను చల్లడం వల్ల నాటిన 20-25 రోజుల వరకు కాండం తొలుచు పురుగు, ఉల్లికోడు, ఆకుముడత వంటివి ఆశించకుండా నివారించవచ్చు. చలి వాతావరణం వల్ల అగ్గితెగులు ఎక్కువగా సోకే అవకాశం ఉన్నందున అగ్గి తెగులు కట్టడికి లీటరు నీటికి ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రోథయోలిన్ 1.5ml కలిపి పిచికారీ చేసుకోవాలి.
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.


