News May 3, 2024
కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం: సుప్రీంకోర్టు

లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణను ఈనెల 7కి వాయిదా వేసింది. ఈ కేసు విచారణకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటే కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తామని పేర్కొంది. కానీ దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది.
Similar News
News December 3, 2025
GHMC విలీన ప్రక్రియ.. డిసెంబర్ 5 డెడ్ లైన్

GHMCలో 27 పురపాలికల విలీనానికి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేస్తూనే డిప్యూటీ కమిషనర్లకు డిసెంబర్ 5 డెడ్ లైన్ విధించారు. విలీనానికి సంబంధించిన అన్ని రికార్డులను డిసెంబర్ 5 లోపు సబ్మిట్ చేయాలని, అంతేగాక మిగతా ఆదేశాలను సైతం అమలు చేయాలని సూచించారు. ఈ ప్రొసీడింగ్ పత్రాలను మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించిన అధికారులకు పంపించారు.
News December 3, 2025
ఉత్కంఠగా భారత్-సౌతాఫ్రికా మ్యాచ్

భారత్-సౌతాఫ్రికా రెండో వన్డే ఉత్కంఠకు దారి తీస్తోంది. సఫారీ జట్టు విజయానికి 72 బంతుల్లో 100 రన్స్ కావాలి. భారత్ గెలుపునకు 7 వికెట్లు అవసరం. ప్రస్తుతం క్రీజులో ఉన్న బ్రీట్జ్కే(49), బ్రేవిస్(31) నిలకడగా ఆడుతున్నారు. వీరిద్దరినీ ఔట్ చేస్తే ఇండియా విజయావకాశాలు మెరుగవుతాయి. ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు? COMMENT