News September 18, 2024
కేజ్రీవాల్‌కు నైతికత ఉంటే అప్పుడే రాజీనామా చేసేవారు: రాజ్‌నాథ్

ఢిల్లీ CM పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయడంపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమర్శలు గుప్పించారు. ఆయనకు నైతిక విలువలు ఉంటే తనపై లిక్కర్ స్కామ్ ఆరోపణలు వచ్చిన రోజే రాజీనామా చేసి ఉండేవారన్నారు. నిజం తేలేవరకు జైలులోని ఉండేవారని చెప్పారు. కానీ ఆయన అప్పుడు అలా చేయలేదని, ఇప్పుడు ప్రజా కోర్టును ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.
Similar News
News December 18, 2025
ఇన్సూరెన్స్ కాల్స్ ‘1600’ నంబర్ల నుంచే రావాలి: TRAI

స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి వచ్చే కాల్స్ అన్నీ తప్పనిసరిగా 1600 సిరీస్ నంబర్ల నుంచే రావాలని పేర్కొంది. ఈ నిబంధనను IRDAI పరిధిలోని అన్ని బీమా సంస్థలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నాటికి అమలు చేయాలని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఫేక్ కాల్స్, ఇన్సూరెన్స్ పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట పడుతుందని TRAI భావిస్తోంది.
News December 18, 2025
భారత్‌కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం

ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో జరిగిన ఫైనల్ పోటీల్లో కర్ణాటకకు చెందిన విద్యా సంపత్ మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా నిలిచారు. మంగళూరుకు చెందిన విద్య ముంబయిలో పుట్టి పెరిగారు. ఈ పోటీల్లో జాతీయ పక్షి నెమలి, జాతీయ ప్రాణి పులి, జాతీయ పుష్పాన్ని పోలిన వస్త్రాలను ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. 22 దేశాలకు చెందిన అందాల భామలతో పోటీపడి భారత్‌కు మొదటి మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ గ్రాండ్ కిరీటం అందిచారు విద్య.
News December 18, 2025
కాసులు కురిపిస్తున్న మల్లెల సాగు

AP: మల్లె పూల సాగు రైతులకు, రాష్ట్రానికి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతోందని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. మల్లె సాగు ద్వారానే వ్యవసాయ రంగంలో రూ.10,749 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగ స్థూల విలువ జోడింపులో ఇది 6.06 శాతంగా ఉంది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలోని మల్లె సాగు విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మిగిలిన జిల్లాల రైతులు కూడా మల్లెసాగుపై దృష్టి పెట్టాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.


