News July 11, 2024

కేజ్రీవాలే కీలక సూత్రధారి.. సౌత్ గ్రూప్‌‌తో కలిసి కవిత కుట్ర: ED

image

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ED అభియోగ పత్రంలో పేర్కొంది. ‘లిక్కర్ పాలసీపై మంత్రుల కమిటీ ఏర్పాటనేది కట్టుకథ. సౌత్ గ్రూప్‌తో పాటు రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు రూ.100 కోట్లు ముడుపులిచ్చారు. వీటిలో రూ.45 కోట్లను 2022 అసెంబ్లీ ఎన్నికలకు కేజ్రీవాల్ వాడుకున్నారు. BRS నాయకురాలు కవిత సౌత్ గ్రూప్‌తో కలిసి కుట్ర పన్నారు. మధ్యవర్తితో నిధులను ఆప్‌కు అందించారు’ అని ED పేర్కొంది.

Similar News

News April 9, 2026

10-15 నిమిషాల్లో తినేస్తున్నారా?

image

సాధారణంగా 10-15 నిమిషాల్లో భోజనం చేస్తే దాన్ని వేగంగా తినడంగా భావిస్తారు. అంటే ఆహారాన్ని సరిగా నమల్లేదని అర్థం. దీనివల్ల బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవల్ పెరిగి టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శరీరానికి పోషకాలు సరిగా అందవు. 20-30 నిమిషాల పాటు తినాలని, ప్రతి ముద్దను 20-30 సార్లు నమలాలని వైద్యులు సూచిస్తున్నారు. తినే సమయంలో టీవీలు, మొబైల్స్ పక్కనపెట్టాలట.
Share It

News April 9, 2026

ఇది విన్నారా.. పాక్ ప్రధానికి నోబెల్ ఇవ్వాలట!

image

పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అక్కడి మీడియా డిమాండ్ చేస్తోంది. ‘అమెరికా, ఇరాన్ యుద్ధాన్ని ఆపడంలో పాక్ కీలక పాత్ర పోషించింది. చర్చలకు అవసరమైన పరిస్థితులను సృష్టించింది. ఇరుపక్షాలకు నమ్మకమైన సమాచార దూతగా వ్యవహరించింది’ అని ఓ సెక్షన్ మీడియా ప్రచారం చేస్తోంది. అంతా బానే ఉంది కానీ.. ఈ శాంతి బహుమతి కోసం విశ్రాంతి లేకుండా ప్రయత్నించిన ట్రంప్ ఊరుకుంటారా?

News April 9, 2026

వరి కొనుగోళ్లు ప్రారంభం.. 2 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు!

image

TG: రాష్ట్రవ్యాప్తంగా రబీ సీజన్ వరి కొనుగోలు ప్రారంభమైంది. వేసవిని దృష్టిలో ఉంచుకొని రైతులకు ఇబ్బందులు కలగకుండా 8,251 కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. కొనుగోలు చేసిన 2 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బు జమ చేయనుంది. అలాగే నాణ్యమైన ధాన్యానికి క్వింటాల్‌పై రూ.500 కూడా వెంటనే అందించనుంది. ఈ సీజన్‌లో 90 లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.