News May 18, 2024
ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్!

తమ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలతో రేపు మ.12గం.కు BJP ప్రధాన కార్యాలయాన్ని చుట్టుముట్టనున్నట్లు AAP చీఫ్, ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రధాని మోదీ అందరినీ అరెస్ట్ చేసుకోవచ్చన్నారు. ‘అందరినీ జైలుకు పంపినంత మాత్రాన ఆప్ను అణచి వేయలేరు. ఆప్ అంటే ఆలోచన. ఎన్ని అరెస్ట్లు చేస్తే అంత విస్తరిస్తుంది’ అని అన్నారు. కాగా ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసులో ఆయన పీఏ విభవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News October 29, 2025
రాబోయే 2-3 గంటల్లో వర్షాలు

TG: గద్వాల్, MBNR, NGKL, నారాయణపేట్, రంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. HNK, HYD, మేడ్చల్, మంచిర్యాల, సంగారెడ్డి, వికారాబాద్, WGL జిల్లాల్లోనూ వానలు కురుస్తాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఆయా జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మీ ప్రాంతంలో వాన పడుతోందా?
News October 29, 2025
తీరం దాటిన తీవ్ర తుఫాన్

AP: మొంథా తీవ్ర తుఫాన్ మచిలీపట్నం-కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో మంగళవారం రా.11:30 గంటల నుంచి రా.12:30 మధ్య తీరాన్ని దాటిందని APSDMA తెలిపింది. ఇది రానున్న 6 గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని వెల్లడించింది. కోస్తా జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తీర ప్రాంత జిల్లాల్లో ఈదురుగాలులు భారీగా వీస్తున్నాయి. ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది.
News October 29, 2025
అక్టోబర్ 29: చరిత్రలో ఈరోజు

1899: కవి, స్వాతంత్ర్య సమరయోధుడు నాయని సుబ్బారావు జననం
1940: రచయిత కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి మరణం
1953: సినీ దర్శకుడు, నిర్మాత ఘంటసాల బలరామయ్య మరణం
1971: ఒడిశాలో తుఫాన్ తాకిడికి 10వేల మంది మృతి
1976: డాన్స్ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ జననం
2005: వలిగొండ వద్ద రైలు పట్టాలు తప్పి వాగులో పడిపోవడంతో 116 మంది మృతి (ఫొటోలో)


