News February 14, 2025

కేజ్రీవాల్ సన్నిహితుడు సత్యేందర్ జైన్‌కు షాక్

image

AAP అగ్ర నేతలకు కష్టాలు తప్పేలా లేవు. ఢిల్లీ మాజీ మంత్రి, కేజ్రీవాల్ సన్నిహితుడు సత్యేందర్ జైన్‌పై దర్యాప్తునకు అనుమతించాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును హోంమంత్రిత్వ శాఖ కోరింది. మనీ లాండరింగ్ కేసులో ఆయనకు వ్యతిరేకంగా ED బలమైన ఆధారాలు సేకరించడమే ఇందుకు కారణమని తెలిసింది. 2017లో CBI ఆయనపై FIR దాఖలు చేసింది. ఆ తర్వాత ED రంగంలోకి దిగింది. 2022 మేలో ఈ కేసులో అరెస్టైన జైన్‌కు గత OCTలో బెయిల్ వచ్చింది.

Similar News

News December 18, 2025

‘బ్రహ్మపుత్ర’పై చైనా డ్యామ్‌.. భారత్‌కు ముప్పు!

image

యార్లంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై $168B (సుమారు రూ.1,51,860CR)తో చైనా నిర్మిస్తున్న భారీ జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది. ఈ నది కోట్లాది మందికి జీవనాధారంగా ఉంది. సుమారు 2KM ఎత్తును ఉపయోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేసే ఈ ప్రాజెక్ట్ వల్ల నది సహజ ప్రవాహం మారే ప్రమాదం ఉంది. దీంతో వ్యవసాయంపై ప్రభావం పడే అవకాశముంది. అలాగే భవిష్యత్తులో నీటిని ఆయుధంగానూ ఉపయోగించే ప్రమాదముంది.

News December 18, 2025

ఐఐటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>ఐఐటీ<<>> హైదరాబాద్ 4 జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE/B.Tech లేదా డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల JE (ఎలక్ట్రికల్) డిసెంబర్ 22న, JE (సివిల్) డిసెంబర్ 23న ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. ఎంపికైనవారికి నెలకు రూ.50,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.iith.ac.in/

News December 18, 2025

గర్భంతో ఉన్నప్పుడు ఈ పొరపాట్లు చెయ్యొద్దు

image

గర్భధారణ సమయంలో ఒకే పొజిషన్‌లో ఎక్కువ సేపు ఉండడం అంత మంచిది కాదు. ప్రెగ్నెన్సీలో ఆరోగ్య సమస్యలకు సొంత వైద్యం పనికిరాదు. బరువైన వస్తువులను ఎత్తడం, అధిక పని చేయడం మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలి. మద్యం, ధూమపానం చేయకూడదు. కెఫీన్ తగ్గించాలి. పచ్చి ఆహారాలను తినకూడదని సూచిస్తున్నారు. సమయానికి తగ్గట్లు స్కానింగ్‌లు చేయించుకోవాలి.