News July 12, 2024
సీబీఐ కేసులో కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీపై సీబీఐ పెట్టిన కేసులో సీఎం కేజ్రీవాల్ జుడీషియల్ కస్టడీని ఈ నెల 25 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఇవాళ మనీలాండరింగ్ కేసులో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర <<13613456>>బెయిల్<<>> ఇచ్చిన విషయం తెలిసిందే. సీబీఐ కేసులో కస్టడీ పొడిగించినందున ఆయన తిహార్ జైలులోనే ఉండనున్నారు.
Similar News
News November 24, 2025
అన్నదాతల సాధికారతకు రైతన్నా మీకోసం: కలెక్టర్

అన్నదాతల సాధికారతే లక్ష్యంగా ఈ రోజు నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర ఆర్థిక సాధనకు మూలస్తంభమైన వ్యవసాయ రంగాన్ని పరిపుష్టి చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని వివరించారు.
News November 24, 2025
ఐబొమ్మ రవి.. విచారణలో సంచలన విషయాలు!

ఐబొమ్మ రవి మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ కలిగి ఉన్నాడని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. ఇవాళ అతడి మాజీ భార్యనూ పోలీసులు విచారించారు. తనతో పాటు కూతురిని చిత్రహింసలకు గురిచేశాడని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. రవి ప్రవర్తన నచ్చకనే విడాకులు ఇచ్చినట్లు ఆమె వెల్లడించారని వార్తలు వస్తున్నాయి. స్నేహితుడు నిఖిల్కు నెలకు రూ.50వేలు ఇచ్చి ఐబొమ్మ సైట్ పోస్టర్లు డిజైన్ చేయించుకున్నట్లుగా గుర్తించారు.
News November 24, 2025
కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CM

AP: అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలను డిస్పోజ్ చేసేందుకు ఓ విధాన నిర్ణయం తీసుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ‘కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి. సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి. బయో వేస్ట్ డిస్పోజల్స్ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించొద్దు. 15,526 హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ద్వారా వచ్చే బయో వ్యర్థాలను 48 గంటల్లోగా డిస్పోజ్ చేయాల్సిందే’ అని స్పష్టం చేశారు.


