News June 19, 2024

జులై 3 వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగింపు

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జులై 3 వరకు పొడిగించింది. లిక్కర్ పాలసీ వ్యవహారంలో అక్రమాల గురించి మరింత క్షుణ్నంగా విచారించేందుకు ఆయన కస్టడీని పొడిగించాలని ED కోరింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనతో పాటు మరో నిందితుడు వినోద్ చౌహాన్ కస్టడీని సైతం జులై 3వరకు పొడిగించింది.

Similar News

News October 23, 2025

రాకియా పిటిషన్ విచారణ ఎల్లుండికి వాయిదా

image

TG: వాన్‌పిక్ వ్యవహారంలో వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌పై రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్‌‍మెంట్ అథారిటీ(RAKIA) దాఖలు చేసిన పిటిషన్‌ను సిటీ సివిల్ కోర్టు(HYD) విచారించింది. తమకు రూ.600 కోట్లు చెల్లించాలన్న రస్ అల్ ఖైమా కోర్టు ఆదేశాలు అమలు చేయాలని రాకియా పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను త్వరగా తేల్చాలని ఇటీవల TG హైకోర్టు ఆదేశించింది. రాకియా ఎగ్జిక్యూటివ్ పిటిషన్‌పై విచారణ ఎల్లుండికి వాయిదా వేసింది.

News October 22, 2025

సౌత్ ఆఫ్రికా సిరీస్‌లో హార్దిక్ పాండ్య!

image

ఆసియా కప్ సమయంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయంతో హార్దిక్ పాండ్య టీమ్‌కు దూరమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌కు కూడా అతను విశ్రాంతిలోనే ఉన్నారు. అయితే హార్దిక్ కోలుకున్నారని, సౌత్ ఆఫ్రికాతో జరగబోయే సిరీస్‌కి అందుబాటులో ఉంటారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. SA జట్టు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 19 వరకు 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20ల కోసం భారత్‌లో పర్యటించనుంది.

News October 22, 2025

ఇందిరమ్మ ఇళ్లపై మరో గుడ్‌న్యూస్

image

TG: 60 చదరపు గజాల కంటే తక్కువ స్థలం ఉంటే జీ+1 తరహాలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పట్టణ ప్రాంతాలవారికి ఈ ఆప్షన్ ఇచ్చింది. రెండు గదులతో పాటు కిచెన్, బాత్రూమ్ తప్పనిసరిగా ఉండాలని పేర్కొంది. గ్రౌండ్ ఫ్లోర్ స్థాయిలో రెండు విడతల్లో రూ.లక్ష చొప్పున, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణంలో ఒకసారి రూ.2లక్షలు, చివరి విడతగా మరో రూ.లక్ష చెల్లించనున్నట్లు వెల్లడించింది.