News September 17, 2024
నేడే కేజ్రీవాల్ రాజీనామా.. కొత్త సీఎంపై సర్వత్రా ఉత్కంఠ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ సాయంత్రం 4.30 గంటలకు తన పదవికి రాజీనామా చేయనున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసి రాజీనామా పత్రాన్ని అందిస్తారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఆప్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ కేజ్రీవాల్ నివాసంలో సమావేశమై చర్చించింది. అతిశీ, రాఘవ్ చద్దా, సౌరభ్ భరద్వాజ్, కైలాశ్ గహ్లోత్ CM రేసులో ముందున్నారు.
Similar News
News November 5, 2025
పంజాబ్& సింధ్ బ్యాంక్లో 30 పోస్టులు

పంజాబ్ & సింధ్ బ్యాంక్(<
News November 5, 2025
ఈ పరిహారాలు పాటిస్తే.. డబ్బు కొరత ఉండదట

కార్తీక పౌర్ణమి పర్వదినాన రావిచెట్టు ఎదుట దీపారాధన చేస్తే కష్టాలు తొలగి, ఇంట్లో శాంతి, ఆనందం ఉంటాయని పండితులు చెబుతున్నారు. నదిలో దీపం వెలిగిస్తే మోక్షం లభిస్తుంది. పాలు కలిపిన నీటిని తులసి మొక్కకు పోయాలి. విష్ణువుకు తిలకం దిద్ది, నువ్వుల నైవేద్యం పెట్టాలి. నేడు అన్నదానం, వస్త్రదానాలు వంటివి చేస్తే.. పేదరికం నుంచి విముక్తి లభిస్తుంది. డబ్బు కొరతే కాక ఆహారం, నీటి కొరత లేకుండా పోతుందని నమ్మకం.
News November 5, 2025
మగాళ్లకూ పీరియడ్స్ వస్తే అమ్మాయిల బాధ అర్థమవుతుంది: రష్మిక

జగపతి బాబు హోస్ట్గా చేస్తున్న ఓ టాక్ షోలో హీరోయిన్ రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘మగాళ్లకూ పీరియడ్స్ వస్తే బాగుండేది. అప్పుడు వాళ్లకు మహిళలు అనుభవించే నొప్పి, బాధ, అసౌకర్యం ఏంటో అర్థమయ్యేది’ అని అన్నారు. రష్మిక కామెంట్లపై జగపతి బాబు చప్పట్లు కొట్టి అభినందించారు.


