News July 31, 2024

కేరళ విపత్తు.. 250మందికి పైగా మృతి!

image

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 250మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. 150కి పైగా మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. ఆస్పత్రుల్లో 200 మందికి పైగా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగిస్తున్నామన్నారు.

Similar News

News January 31, 2026

పెరుగుట విరుగుట కొరకే!

image

‘పెరుగుట విరుగుట కొరకే’ అనేది సుమతీ శతకంలోని ఓ ప్రసిద్ధ పద్యం. ప్రస్తుతం బంగారం, వెండి ధరలకు ఇది అతికినట్టే సరిపోతుంది. ఇటీవల ప్రతిరోజూ ఆకాశమే హద్దుగా రూ.వేలల్లో పెరుగుతూ వచ్చిన వీటి ధరలు నిన్నటి నుంచి నేలచూపులు చూస్తున్నాయి. వెండి కేజీపై రెండ్రోజుల్లో రూ.75వేలు, 10గ్రాముల బంగారంపై దాదాపు రూ.20వేలు తగ్గాయి. త్వరలో శుభకార్యాలకు ముహూర్తాలు ఉండటంతో సామాన్య ప్రజానీకానికి తగ్గిన ధరలు ఊరటనిస్తున్నాయి.

News January 31, 2026

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియాలో పోస్టులు

image

తెహ్రీ హైడ్రో డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇండియా(THDC)లో 100 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ITI, BE, BTech, BBA అర్హతగల వారు www.apprenticeshipindia.org పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తును, డాక్యుమెంట్స్‌ను పోస్ట్ చేయాలి. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: https://thdc.co.in

News January 31, 2026

రెండు రోజుల్లో రూ.75వేలు తగ్గిన కేజీ సిల్వర్ రేటు

image

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం, వెండి ధరలు అమాంతం పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కేజీ సిల్వర్ రేటు ఇవాళ ఒక్కరోజే రూ.55వేలు పతనమై రూ.3,50,000కు చేరింది. కేవలం రెండు రోజుల్లోనే రూ.75వేలు తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిస్తే.. ఇన్వెస్టర్లకు భారీ నష్టాలనిచ్చింది. అలాగే రెండు రోజుల్లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.18,270 క్షీణించగా 22 క్యారెట్ల 10gల గోల్డ్ రేటు రూ.16,750 తగ్గడం విశేషం.