News July 26, 2024
స్కూల్ సర్టిఫికెట్లలో మతం మార్పునకు కేరళ హైకోర్టు అనుమతి

మతం మారిన ఇద్దరు కేరళ యువకులకు స్కూల్ సర్టిఫికెట్లలో మతం పేరు మార్చుకునేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు అనుమతినిచ్చింది. పౌరులు తమకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛను రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) కల్పిస్తుందని తెలిపింది. హిందూ మతంలో జన్మించిన యువకులు 2017లో క్రిస్టియానిటీలోకి మారారు. సర్టిఫికెట్లలో మార్పులకు అధికారులు నిరాకరించడంతో వారు కోర్టును ఆశ్రయించగా, మార్పులు చేయాలని కోర్టు ఆదేశించింది.
Similar News
News September 18, 2025
జుట్టు లేని కొబ్బరి కాయను కొట్టకూడదా?

దేవుడికి జుట్టు లేని కొబ్బరికాయను కొట్టకూడదని పండితులు చెబుతున్నారు. కొబ్బరికాయ మన శరీరానికి ప్రతీక. దానిపై ఉన్న పీచు మనలోని అహంకారానికి, జ్ఞానానికి చిహ్నం. భగవంతునికి మన శరీరాన్ని, ఆత్మను సంపూర్ణంగా సమర్పించుకోవడానికి కొబ్బరికాయ కొడతాం. అందుకే జుట్టు ఉన్న కొబ్బరికాయనే కొట్టి, ఆత్మనివేదన అనే భక్తి మార్గాన్ని అనుసరించాలి. జుట్టు లేని కాయను సమర్పించడం అసంపూర్ణ సమర్పణగా భావిస్తారు.
News September 18, 2025
సాయిబాబా విగ్రహం పాలరాయితోనే ఎందుకు?

పాలరాయి ఆధ్యాత్మికంగా స్వచ్ఛతకు, బలానికి ప్రతీక. ఈ లక్షణాలు బాబా బోధనలకు అనుగుణంగా ఉంటాయి. పాలరాయి విగ్రహం ఉన్న చోట ప్రశాంతమైన, సామరస్య పూర్వక వాతావరణం ఏర్పడుతుందని భక్తులు నమ్ముతారు. అంతేకాకుండా ఇది సహజమైనది, ప్రాసెస్ చేయనిది కావడంతో పవిత్రంగా పూజా మందిరాల్లో ఉంచుకోవడానికి ఇష్టపడతారు. అనేక ఆలయాల్లోనూ పాలరాయితో చేసిన సాయిబాబా విగ్రహాలే మనకు దర్శనమిస్తుంటాయి.
News September 18, 2025
నవ గ్రహాలు – భార్యల పేర్లు

సూర్యుడు – ఉష, ఛాయ
చంద్రుడు – రోహిణి
కుజుడు – శక్తి దేవి
బుధుడు – జ్ఞాన శక్తి దేవి
గురుడు – తారా దేవి
శుక్రుడు – సుకీర్తి దేవి
శని – జేష్ఠా దేవి
రాహువు – కరాళి దేవి
కేతువు – చిత్రాదేవి