News January 31, 2025

లిక్కర్ స్కాంలో కవిత: కేరళ ప్రతిపక్ష నేత

image

TG: ఢిల్లీ తరహాలో కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించారని ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ ఆరోపించారు. ‘పాలక్కడ్‌లోని ఒయాసిస్ కమర్షియల్ కంపెనీకి మద్యం తయారీ పర్మిషన్ ఇచ్చారు. సీఎం పినరయి, ఎక్సైజ్ మంత్రి రాజేశ్ ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని కవితనే కేరళకు వచ్చి మరీ నడిపించారు’ అని చెప్పారు. ఈ వ్యాఖ్యలను కవిత ఖండించారు.

Similar News

News November 9, 2025

బాధపడొద్దు.. తెల్ల జుట్టు మంచిదే : సైంటిస్ట్‌లు

image

జుట్టు తెల్లబడటం మంచిదే అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. శరీరంలో క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను నాశనం చేసే ప్రాసెస్‌లో జుట్టు రంగు కోల్పోతుందని చెబుతున్నారు. మెలనోసైట్ సెల్స్ కారణంగా జుట్టు నల్లగా ఉంటుందని, ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడే ఈ కణాలు జుట్టుకు రంగును అందిస్తాయని అంటున్నారు. శరీరంలో క్యాన్సర్‌గా మారే కణాలను అంతం చేసే ప్రక్రియలో మెలనోసైట్స్ తమను తాము చంపుకుంటాయని స్పష్టం చేస్తున్నారు.

News November 9, 2025

వైస్ కెప్టెన్సీ వల్లే T20 జట్టులో గిల్‌?

image

బ్యాటింగ్‌లో విఫలమవుతున్నా గిల్‌కు T20 జట్టులో చోటు కల్పిస్తుండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. వైస్ కెప్టెన్‌గా ఉన్నందునే జట్టులో ఉంచుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జైస్వాల్, సంజూ మంచి ఫామ్‌లో ఉన్నా గిల్ కోసం వారిని బెంచ్‌కే పరిమితం చేస్తున్నారని అంటున్నారు. 19 T20ల్లో 136SRతో గిల్ 502రన్స్ చేశారు. అటు జైస్వాల్ 6 T20ల్లో 170SRతో 221, సంజూ 13 T20ల్లో 182SRతో 417 పరుగులు చేశారు.

News November 9, 2025

తుఫాను బీభత్సం.. 224కు చేరిన మృతుల సంఖ్య

image

ఫిలిప్పీన్స్‌లో కల్మేగీ తుఫాను మరణ మృదంగం కొనసాగుతోంది. ఇప్పటి వరకు 224మంది మృతి చెందగా 109మంది గల్లంతయ్యారు. ఒక్క సెబూ ఐలాండ్‌లోనే వరదల వల్ల 158మంది చనిపోయారు. 526 మంది గాయపడగా 700 మందికి పైగా నిరాశ్రయులు అయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఆ దేశంలోని 53 కమ్యూనిటీస్‌లో ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ఈ తుఫానును ఆ దేశ ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ జాతీయ విపత్తుగా ప్రకటించారు.