News August 17, 2024
ఏపీలో కేరళ తరహా ‘కుటుంబశ్రీ’ విధానం

AP: కేరళలో అమలవుతున్న ‘కుటుంబశ్రీ’ విధానాన్ని దేశవ్యాప్తంగా తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. తొలి విడతలో 7 రాష్ట్రాలను గుర్తించగా, అందులో AP ఉంది. అనంతపురం, చిత్తూరు, శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, బాపట్ల జిల్లాల నుంచి 60 మండలాలను ఎంపిక చేసింది. కుటుంబశ్రీ విధానంలో డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు పంచాయతీరాజ్ సంస్థల పర్యవేక్షణలో జరుగుతాయి. మహిళలకు జీవనోపాధి కల్పనకు నిధులు వాటి నుంచే విడుదలవుతాయి.
Similar News
News December 8, 2025
NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్చైన్ డెవలప్మెంట్లో 5 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల వారు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి BE, B.tech, PG(అగ్రి బిజినెస్), M.COM, CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: nccd.gov.in.
News December 8, 2025
ఇంటి చిట్కాలు మీ కోసం..

* నిమ్మచెక్కతో మైక్రోవేవ్ పైభాగాన్ని శుభ్రం చేస్తే మచ్చలు త్వరగా పోతాయి.
* స్టెయిన్ లెస్ స్టీలుకు బేబీ ఆయిల్ రాస్తే గీతలు పడకుండా దృఢంగా ఉండడమే కాదు కొత్తదానిలా తళతళలాడుతుంది.
* ఫ్రిజ్లో తరిగిన నిమ్మకాయ ముక్క పెడితే సువాసనలు వెదజల్లుతుంది.
* ఇంట్లోని సింకు బ్లాక్ అయితే సోడియం బైకార్బొనేట్తో పాటు ఒక బాటిల్ వైట్ వెనిగర్ ని కూడా వేస్తే నీళ్లు సింకులోంచి వేగంగా పోతాయి.
News December 8, 2025
2026లోనూ బంగారం ధరల పెరుగుదల: గోల్డ్ కౌన్సిల్

బంగారం ధరల పెరుగుదల వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా వేసింది. ఆర్థిక అస్థిరత, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా పసిడికి డిమాండ్ కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. సెంట్రల్ బ్యాంకులు భారీగా కొంటుండటం, గోల్డ్ రీసైక్లింగ్ యాక్టివిటీలు, ఇన్వెస్టర్లు సురక్షిత పెట్టుబడిగా భావించడం ఇందుకు కారణమని చెప్పింది. ఈ ఏడాది నవంబర్ వరకు బంగారం 60% పెరుగుదల కనబరిచిన విషయం తెలిసిందే.


