News February 13, 2025

ఇంగ్లండ్ జట్టుపై కెవిన్ పీటర్సన్ తీవ్ర ఆగ్రహం

image

భారత్‌తో ODI సిరీస్‌లో ENG జట్టు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ ఆటగాళ్లు కేవలం ఒకే ఒక్క ప్రాక్టీస్ సెషన్ ఆడారు. వారి నిర్లక్ష్యం చూసి నేను షాక్ తిన్నాను. మధ్యలో గోల్ఫ్ మాత్రం ఆడుకున్నారు. వారికి జీతం ఇచ్చేది దేశం కోసం క్రికెట్ ఆడటానికే గానీ గోల్ఫ్ ఆడుకోవడానికి, టూర్‌ని ఎంజాయ్ చేయడానికి కాదు’ అని మండిపడ్డారు.

Similar News

News February 13, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ అంబాసిడర్‌గా శిఖర్ ధవన్

image

భారత మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్‌ ఛాంపియన్స్ ట్రోఫీకి అంబాసిడర్‌‌గా నియమితులయ్యారు. అతనితో పాటు PAK క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్, AUS మాజీ ఆల్‌రౌండర్ వాట్సన్, NZ మాజీ పేసర్ సౌథీని ICC అంబాసిడర్లుగా ఎంపిక చేసింది. 2013లో భారత్ CT గెలవడంలో గబ్బర్ కీలకంగా వ్యవహరించారు. అలాగే, టోర్నీ చరిత్రలో వరుసగా 2సార్లు ‘గోల్డెన్ బ్యాట్’ అవార్డ్ అందుకున్న ఏకైక క్రికెటర్‌గా నిలిచినందుకు శిఖర్‌కు ఈ గౌరవం దక్కింది.

News February 13, 2025

దేశంలోనే కర్నూలులో హై టెంపరేచర్

image

AP: రాష్ట్రంలో మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కర్నూలులో బుధవారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 37.8°C నమోదైంది. రాయలసీమ, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో నిన్న పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు అధికంగా నమోదయ్యాయి. మరోవైపు, కోస్తాంధ్రలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8గంటల వరకు పొగమంచు దట్టంగా కురిసి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

News February 13, 2025

రేషన్ కార్డులు.. ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఫిర్యాదు చేయండిలా!

image

TG: రేషన్ కార్డు దరఖాస్తు కోసం మీ-సేవ నిర్వాహకులు రూ.50 మాత్రమే తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని చోట్ల ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయా సెంటర్ల నిర్వాహకులకు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. విచారణ జరిపి వారి లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. ఎవరైనా ఎక్కువ డబ్బులు తీసుకుంటే మీ-సేవ హెల్ప్ లైన్ నంబర్ 1100కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

error: Content is protected !!