News December 4, 2024

పృథ్వీ షాకు కెవిన్ పీటర్సన్ సందేశమిదే

image

యువ ఆటగాడు పృథ్వీ షా గురించి ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ట్విటర్లో ఆందోళన వ్యక్తం చేశారు. ‘క్రీడల్లో కొన్ని గొప్ప కథలు ‘కమ్‌బ్యాక్’తో కూడుకున్నవే. పృథ్వీషా చుట్టూ అతడి మంచి కోరుకునేవారు ఉంటే వారు తనకు సోషల్ మీడియా వదిలేయాలని, సూపర్ ఫిట్‌నెస్ సాధించేవరకు అత్యంత కఠోరంగా శ్రమించాలని, తిరిగి చక్కటి దారిలో నడవాలనే సూచనలు చేయాలి. టాలెంట్ ఉన్న వ్యక్తి కెరీర్‌ను కోల్పోకూడదు’ అని పేర్కొన్నారు.

Similar News

News December 8, 2025

జిల్లాలో 100% ఓటింగే లక్ష్యం: జనగామ కలెక్టర్

image

జనగామ జిల్లాలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలలో 100% ఓటింగ్ ఎలక్షన్ గా ప్రతి ఒకరు పాటుపడాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సూచించారు. ఓటు వినియోగించుకునేందుకు ఓటర్ గుర్తింపు కార్డు ఒకటే ప్రధానం కాదని, ఎన్నికల సంఘం సూచించిన 18 రకాల గుర్తింపు కార్డులను చూపి తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. గత గ్రామపంచాయతీ ఎన్నికలలో 90.14 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని ఉన్నారు.

News December 8, 2025

భారత్‌లో విమానయాన సంస్థలకు డిమాండ్: రామ్మోహన్ నాయుడు

image

భారత్‌లో విమాన సర్వీసులకు డిమాండ్ పెరుగుతోందని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. డిమాండ్‌కు తగినట్టుగా కాంపిటీటర్స్ ఉండాలని, దేశంలో మరో 5 పెద్ద విమాన సంస్థల అవసరం ఉందని చెప్పారు. ఏవియేషన్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. <<18503378>>ఇండిగో సంక్షోభం<<>>పై చర్యలు తీసుకోవడంతోపాటు దానిని ఒక ఉదాహరణగా తీసుకుంటామని చెప్పారు.

News December 8, 2025

డబ్బు విలువ ఎందుకు తగ్గుతుందంటే?

image

ద్రవ్యోల్బణం వల్ల డబ్బు <<18505684>>విలువ<<>> ఎలా తగ్గుతుందనే డౌట్ చాలామందికి రావొచ్చు. ద్రవ్యోల్బణం అంటే వస్తు, సేవల ధరలు సాధారణంగా పెరగడం. దీని ఫలితంగా డబ్బుకున్న కొనుగోలు శక్తి కాలక్రమేణా తగ్గుతుంది. ఉదా.. 6% ద్రవ్యోల్బణం ఉంటే ఈ రోజు ₹100తో కొన్న వస్తువును భవిష్యత్తులో ₹106 పెట్టి కొనాల్సి వస్తుంది. అంటే మీ దగ్గరున్న డబ్బుతో గతంలో కొన్నంత ఎక్కువ వస్తువులను ఫ్యూచర్‌లో కొనలేరు. ఇలా డబ్బు విలువ తగ్గుతుంది.