News October 10, 2025
మార్కెట్ కమిటీలు, రైతు బజార్లపై కీలక సూచన

AP: వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, రైతు బజార్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, రైతు బజార్లను అనుసంధానం చేసి ఓ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని 218 మార్కెట్ కమిటీల స్థలాల్లో అగ్రి ప్రాసెసింగ్ యూనిట్స్, కోల్డ్ చైన్ ఏర్పాటు చేయాలని.. రైతులు, వినియోగదారులు లాభపడేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.
Similar News
News October 10, 2025
ఏ దేవుడికి ఏ నూనెతో దీపం వెలిగించాలి?

ఇష్టదైవాన్ని ఆరాధించేటప్పుడు శ్రేయస్సు, ప్రతిష్ఠల కోసం ఆముదం నూనెతో దీపం వెలిగించాలి.
ఆంజనేయుడి కటాక్షం పొందడానికి మల్లెపూల నూనెతో దీపారాధన చేయాలి.
శత్రువుల నుంచి రక్షణ పొందడానికి కాలభైరవుడి ఆలయంలో ఆవనూనెతో దీపం వెలిగించాలి.
ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఆవాల నూనెతో దీపారాధన చేయాలి.
రాహు, కేతు వంటి గ్రహాల ప్రతికూల ప్రభావం తొలగిపోవడానికి, మునగ నూనెతో దీపం వెలిగించాలి.
News October 10, 2025
అందం కోసం ఆరాటం ప్రాణాలను తీసింది

అందం కోసం సర్జరీలు చేయించుకొనే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అదే ప్రాణాల మీదకు తెస్తుంది. తాజాగా FOX EYES (నీలి కళ్లు) కోసం కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్న బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అడైర్ మెండెస్ దత్రా(31) చనిపోయారు. సర్జరీతో ఆమెకు సివియర్ ఫేషియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఊపిరి కూడా అందక మరణించారు. సర్జరీ తర్వాత సరైన పోషకాహారం ఇతర జాగ్రత్తలు పాటించాలని ప్లాస్టిక్ సర్జన్ కిరణ్మయి సూచించారు.
News October 10, 2025
జైస్వాల్ 150 రన్స్ నాటౌట్

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో IND ఓపెనర్ జైస్వాల్ 150 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఆయన ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లున్నాయి. అటు టెస్టుల్లో వేగంగా(71 ఇన్నింగ్స్‌లు) 3వేల రన్స్ చేసిన రెండో IND బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచారు. తొలి ప్లేస్‌లో గవాస్కర్(69 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. మరోవైపు సుదర్శన్ 87 రన్స్ వద్ద ఔటై సెంచరీ మిస్ చేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్‌తో పాటు గిల్(15) ఉన్నారు. IND స్కోర్ 294/2.