News December 22, 2024
ISRO-ESA మధ్య కీలక ఒప్పందం

వ్యోమగాములకు శిక్షణ, పరిశోధనలపై సహకరించుకునేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇస్రో మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించిన పత్రాలపై ఇస్రో చీఫ్ సోమనాథ్, ESA డైరెక్టర్ జోసెఫ్ సంతకాలు చేశారు. ISSలో సౌకర్యాల వినియోగం, మానవ అంతరిక్ష పరిశోధన, బయో మెడికల్ ప్రయోగాలు, విద్యపై కలిసి పనిచేస్తాయి. Axiom-4 మిషన్లో ఇస్రో గగన్యాత్రి, ESA వ్యోమగాములు క్రూ మెంబర్లుగా ఉండనున్నారు.
Similar News
News November 14, 2025
BRSకు స్వల్ప ఆధిక్యం

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్లోని ఒక EVMలో BRSకు స్వల్ప ఆధిక్యం వచ్చింది. మూడో రౌండ్లో ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఓట్లను లెక్కించారు. అటు ఇప్పటివరకు 3 రౌండ్లలో కలిపి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది.
News November 14, 2025
కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News November 14, 2025
తగ్గిన బంగారం ధరలు

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.


