News March 26, 2025
రష్యా, ఉక్రెయిన్ మధ్య కీలక ఒప్పందం

రష్యా, ఉక్రెయిన్ కీలక ఒప్పందానికి వచ్చాయి. చమురు కర్మాగారాలు, రిఫైనరీలు, విద్యుత్ ప్లాంట్లు తదితర ఇంధన ఉత్పత్తి ప్రాంతాలపై దాడి చేసుకోరాదని అంగీకరించాయి. ఓ ప్రకటనలో రష్యా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది 30 రోజుల కోసం చేసుకున్న తాత్కాలిక ఒప్పందమేనని, పరస్పర అంగీకారంతో మరింత పొడిగించేందుకు అవకాశం ఉందని పేర్కొంది. రెండు దేశాల్లో ఎవరు ఈ అంగీకారాన్ని ఉల్లంఘించినా ఒప్పందం రద్దవుతుందని వివరించింది.
Similar News
News March 29, 2025
బయటి జ్యూస్‌లు తాగుతున్నారా?

బయటికెళ్లినప్పుడు వేసవి వేడికి తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ జ్యూస్‌లు తాగేస్తుంటాం. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. HYDలో ఫుడ్ హబ్‌గా పేరొందిన DLF ప్రాంతంలో పలు జ్యూస్ షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించారు. అక్కడ కుళ్లిన పళ్లు, మురికి ఐస్ గడ్డలు, కాలం చెల్లిన పాలు, బొద్దింకలు, ఎలుకల సంచారాన్ని గుర్తించారు. దీంతో ఆ షాప్‌లకు అధికారులు నోటీసులిచ్చారు.
News March 29, 2025
కొత్త సినిమా రికార్డు.. రెండ్రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు!

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన ‘L2 ఎంపురాన్’ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈనెల 27న ఈ చిత్రం విడుదలవగా రెండ్రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి చరిత్ర సృష్టించినట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని, వీకెండ్ పూర్తయ్యేలోపు మరిన్ని కలెక్షన్లు వస్తాయని సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రాన్ని పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించారు.
News March 29, 2025
ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్లు

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ ‘ఇన్‌స్టాగ్రామ్’లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. రీల్స్ చూసేటప్పుడు వీడియోను ఫార్వర్డ్ చేయాలంటే కష్టంగా ఉండేది. కొత్త ఫీచర్ ద్వారా వీడియోకు కుడి/ ఎడమ వైపు లాంగ్ ప్రెస్ చేస్తే వీడియో 2x స్పీడ్‌లో ఫార్వర్డ్ అవుతుంది. మధ్యలో ప్రెస్ చేస్తే వీడియో పాజ్ అవుతుంది. దీంతోపాటు వాట్సాప్‌లా ఇన్‌స్టాలోనూ మెసెంజర్‌లో మన లొకేషన్ పంపొచ్చు.