News October 14, 2025

నేడు కీలక ఒప్పందం

image

AP: విశాఖలో ఏర్పాటు కానున్న 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం నేడు కీలక ఒప్పందం కుదుర్చుకోనుంది. రూ.88,628CR(10 బి.డాలర్ల)తో గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌తో MOU కుదరనుంది. ఢిల్లీలో 10AMకు CM చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్‌, నిర్మలా సీతారామన్‌, మంత్రి లోకేశ్‌ సమక్షంలో MOUపై సంతకాలు చేయనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని ప్రభుత్వం చెబుతోంది.

Similar News

News February 18, 2026

నమీబియాపై ఘన విజయం.. సూపర్-8కి పాక్

image

T20WC: నమీబియాపై పాకిస్థాన్ 102 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాక్ సూపర్-8కి అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. 20 ఓవర్లలో 199/3 రన్స్ చేసింది. ఓపెనర్ ఫర్హాన్ సెంచరీ (58 బంతుల్లో 100)తో రాణించారు. అనంతరం నమీబియా 17.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌటైంది. కాగా సూపర్-8లో పాకిస్థాన్.. న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకలతో తలపడనుంది.

News February 18, 2026

‘అమ్మను బాగా చూసుకో’.. సోనూసూద్ ఉదారత!

image

గత రెండేళ్లుగా మంచానికే పరిమితమైన తన తల్లి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతోందని, ఆక్సిజన్ కాన్సంట్రేటర్ కొనే శక్తి లేదని ఓ నెటిజన్ చేసిన విన్నపానికి నటుడు సోనూసూద్ స్పందించారు. ఆక్సిజన్ యంత్రాన్ని నేరుగా వారి ఇంటికే పంపించి తన ఉదారతను చాటుకున్నారు. ‘తల్లిని బాగా చూసుకో’ అని ఆ యువతికి ధైర్యం చెప్పారు. కరోనా కష్టకాలం నుంచి సోనూసూద్ నిరంతరం సామాన్యులకు అండగా నిలుస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు.

News February 18, 2026

భారీగా పెరిగిన సిగరెట్ ధరలు

image

ITC సంస్థ సిగరెట్ ధరలను 19-41% పెంచింది. FEB 1 నుంచి <<18730084>>కొత్త<<>> ఎక్సైజ్ డ్యూటీస్, ట్యాక్స్‌లు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్, క్లాసిక్ వంటి బ్రాండ్ల సిగరెట్ ధరలు పెరిగాయి. గోల్డ్ ఫ్లేక్ 10 సిగరెట్ల ప్యాక్ ధర ₹170 నుంచి ₹240కి చేరింది. 20 పీస్ క్లాసిక్ వేరియంట్ ప్యాక్ ₹340 నుంచి ₹480కి పెరిగింది. అలాగే సూపర్‌స్టార్ వాల్యూ ₹70 (10Pc)కి పెరిగింది.