News July 8, 2024

డీఎస్సీ పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన

image

TG: డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు ఆందోళన చేస్తుండగా.. పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ స్పందించింది. DSC పరీక్షలు <<13528813>>యథాతథంగా<<>> నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపింది. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.

Similar News

News December 1, 2025

విటమిన్-E ఫుడ్స్‌తో చర్మం, గుండె ఆరోగ్యం పదిలం!

image

విటమిన్-E ఉండే ఆహార పదార్థాలు చర్మం, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. బాదం, సన్ ఫ్లవర్ గింజలు, పాలకూర, బ్రకోలీ, కివీ, ఆలివ్ నూనె, అవకాడో డైట్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. బాదం, అవకాడో చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు గుండె పనితీరును మెరుగు పరుస్తాయంటున్నారు. బ్రకోలీ ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుందని, కివీతో చర్మ ఆరోగ్యంతో పాటు ఇమ్యూనిటీ పెరుగుతుందని చెబుతున్నారు.

News December 1, 2025

ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలియజేయండి: గొట్టిపాటి

image

AP: ‘దిత్వా’ తుఫాను వేళ విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవి ఆదేశించారు. దక్షిణ కోస్తా, రాయలసీమ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలి. గత అనుభవాల దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పరిస్థితిని ఎప్పటికప్పుడు నాకు తెలియజేయండి’ అని మంత్రి తెలిపారు.

News December 1, 2025

నా పార్ట్‌నర్ హాఫ్ ఇండియన్: మస్క్

image

నిఖిల్ కామత్ ‘People by WTF’ పాడ్‌కాస్ట్ షోలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన భాగస్వామి శివోన్ జిలిస్ హాఫ్ ఇండియన్ అని చెప్పారు. తన సంతానంలో ఓ కుమారుడి పేరులో శేఖర్ అని ఉంటుందని, నోబెల్ గ్రహీత సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ పేరు నుంచి దీనిని తీసుకున్నట్లు వెల్లడించారు. భారత్, US మధ్య సంబంధాలు ఇతర ఆసక్తికర అంశాలను ఆయన పంచుకున్నారు. పూర్తి వీడియో కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.