News October 24, 2024

కరెంట్ ఛార్జీల పెంపుపై కీలక ప్రకటన

image

TG: రాష్ట్రంలో సామాన్యులపై కరెంట్ ఛార్జీలు పెంచబోమని డిస్కం సీఎండీ ముషారఫ్ స్పష్టం చేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై కూడా ఛార్జీల భారం పడదని చెప్పారు. నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగదారులకు ఫిక్స్‌డ్ ఛార్జీల రూపంలో రూ.50 పెంపు కోసం ప్రతిపాదించామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరగబోతున్నాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముషారఫ్ ఇలా స్పందించారు.

Similar News

News January 8, 2026

కే. అగ్రహరంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్

image

సంక్రాంతి పండగను పురస్కరించుకొని కె. అగ్రహారం గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ నెల 10 నుంచి జిల్లాస్థాయి సీటీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు సునీల్, షరీఫ్ తెలిపారు. పోటీల్లో పాల్గొనదలచిన జట్లు రూ.700 ఎంట్రీ ఫీజు చెల్లించి ఈనెల 8 లోగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. విజేతలకు మొదటి బహుమతి రూ.50,116, రెండో బహుమతి 25,116 అందజేస్తామన్నారు.

News January 8, 2026

బెండలో నీటి యాజమాన్యం, కలుపు నివారణ

image

బెండ విత్తనాలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. నల్లరేగడి నేలల్లో అయితే ప్రతి ఐదారు రోజులకు నీరు అందించాలి. పూత, కాయ దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నీటి లభ్యత బాగా తక్కువగా ఉంటే బిందుసేద్యం విధానం అనుసరించడం మంచిది. పంటకాలంలో 3 నుంచి నాలుగుసార్లు కలుపు తీయాల్సి ఉంటుంది. విత్తనాలు వేసిన 2 వారాలకు కలుపు నియంత్రణ చర్యలు చేపట్టాలి. తర్వాత సమస్యను బట్టి కలుపును తొలగించుకోవాలి.

News January 8, 2026

YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందా?

image

AP: రాజధాని అంశం రాష్ట్ర రాజకీయాల్లో కాక రేపుతోంది. అమరావతిపై <<18799615>>జగన్<<>> చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో YCP అధికారంలోకి వస్తే రాజధాని మారుతుందనే చర్చ మొదలైంది. గతంలో తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనను ఈసారి అమలు చేస్తారనే టాక్ విన్పిస్తోంది. మరోవైపు అమరావతికి చట్టబద్ధత తెస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాగా ప్రభుత్వం మారితే APకి రాజధాని మారుతుందా?, శాశ్వత క్యాపిటల్ ఉండదా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.