News November 11, 2024
మహిళలకు ఉచిత బస్సుపై కీలక ప్రకటన

AP: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కొలుసు పార్థసారథి కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఫ్రీ బస్ పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. ఇక తల్లికి వందనం స్కీమ్‌కు ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించామన్నారు. నిరుద్యోగ భృతికి వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజారంజక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మంత్రి తెలిపారు.
Similar News
News December 1, 2025
జగిత్యాల: రూ.28 లక్షల విలువైన 136 మొబైల్స్ రికవరీ

పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను CEIR పోర్టల్ ద్వారా సులభంగా తిరిగి పొందవచ్చని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో రూ.28 లక్షల విలువగల 136 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. CEIRలో IMEI వివరాలు నమోదు చేస్తే ఫోన్లను త్వరగా ట్రేస్ చేయవచ్చని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో రూ.3.5 కోట్ల విలువగల 1548 ఫోన్లు రికవరీ చేసినట్లు వెల్లడించారు.
News December 1, 2025
ఇకపై అన్ని ఫోన్లలో ప్రభుత్వ యాప్.. డిలీట్ చేయలేం!

దేశంలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలిచ్చినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఇకపై తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్ ‘సంచార్ సాథీ’ని డిఫాల్ట్‌గా ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ యాప్‌ను డిలీట్ చేయలేరు. ఇందుకు 90 రోజుల గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ అంశంపై అటు ప్రభుత్వం, ఇటు మొబైల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు.
News December 1, 2025
‘చిన్నస్వామి’ సేఫ్టీ క్లియరెన్స్ కోరిన ప్రభుత్వం

RCB ర్యాలీలో తొక్కిసలాట నేపథ్యంలో వచ్చే IPLకు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో మ్యాచులు జరగడంపై సందిగ్ధత నెలకొంది. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్‌కు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నోటీసులు ఇచ్చింది. స్టేడియం సేఫ్టీ రిపోర్ట్ సమర్పించాలని కోరింది. ఆ నివేదిక నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్ నుంచి సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్‌తో ప్రిపేర్ చేయించాలని ఆదేశించింది.


