News October 30, 2024
గ్రూప్-2 పరీక్షలపై కీలక ప్రకటన
AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై APPSC కీలక ప్రకటన చేసింది. జనవరి 5న ఉదయం, సాయంత్రం ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. 13 ఉమ్మడి జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయని, దాదాపు లక్ష మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొంది. వచ్చే ఏడాది జరిగే DSC, టెన్త్, ఇంటర్ పరీక్షల దృష్ట్యా జనవరి 5న పరీక్ష నిర్వహిస్తున్నట్లు APPSC ప్రకటనలో వివరించింది.
Similar News
News October 30, 2024
మెడికల్ కాలేజీకి యల్లాప్రగడ పేరు: పవన్
AP: రాష్ట్రంలోని ఏదైనా మెడికల్ కాలేజీకి ప్రముఖ వైద్య శాస్త్రవేత్త యల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన CM చంద్రబాబుకు పూర్తి వివరాలు పంపారు. ‘సుబ్బారావు భీమవరంలో పుట్టి, రాజమండ్రిలో చదువుకున్నారు. కాబట్టి ఏలూరు, రాజమండ్రిలోని ఏదైనా ఒక కళాశాలకు ఆయన పేరు పెడితే సముచితంగా ఉంటుంది. సీఎం స్పందించి ఈ ప్రతిపాదనను పరిశీలించాలి’ అని ఆయన పేర్కొన్నారు.
News October 30, 2024
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
TG: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి సందర్భంగా 3.64 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది 2022 జులై 1 నుంచి వర్తిస్తుందని తెలిపింది. పెరిగిన డీఏను నవంబర్ జీతంతో కలిపి ఇవ్వనుంది. 2022 జులై నుంచి 2024 అక్టోబర్ 31 వరకు ఉన్న డీఏ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనున్నారు.
News October 30, 2024
‘జై హనుమాన్’ హీరో ఈయనే..
‘జై హనుమాన్’లో హీరోగా రిషబ్ శెట్టి నటించనున్నారు. హనుమంతుడి పాత్రలో ఆయన రాముడి విగ్రహాన్ని హత్తుకున్న ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ దీపావళిని ‘జై హనుమాన్’ నినాదంతో మొదలుపెడదామని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. కాగా ‘హనుమాన్’ మూవీ హిట్ కావడంతో జై హనుమాన్‌పై ఫ్యాన్స్‌కు భారీ అంచనాలున్నాయి. హనుమాన్‌లో హీరోగా తేజా సజ్జ నటించిన విషయం తెలిసిందే.