News January 29, 2025
ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపుపై కీలక ప్రకటన

TG: ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును పెంచే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. వచ్చే నెల 7న ఐటీ, ఇండస్ట్రీ సెక్టార్లో ఉద్యోగాలకు సంబంధించి కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలిపారు. వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కంటే కాంగ్రెస్ హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయని చెప్పారు.
Similar News
News January 24, 2026
ESIC రాంచీలో 82 పోస్టులకు నోటిఫికేషన్

<
News January 24, 2026
‘సింకింగ్ ఫండ్’.. అప్పుల బాధ ఉండదిక!

పెద్ద ఖర్చులు వచ్చినప్పుడు క్రెడిట్ కార్డులు, చేబదుళ్లపై ఆధారపడకుండా ఉండాలంటే ‘సింకింగ్ ఫండ్’ ఉత్తమ మార్గం. ఏడాదికోసారి వచ్చే బీమా ప్రీమియంలు, పండుగ ఖర్చులు లేదా పిల్లల ఫీజుల కోసం ముందే నెలకు కొంత చొప్పున పక్కన పెట్టడమే ఈ ఫండ్ లక్ష్యం. అప్పు తీసుకుని వడ్డీ కట్టే బదులు మనమే వాయిదాల్లో డబ్బు దాచుకుంటే రివర్స్లో మనకే బ్యాంక్ నుంచి వడ్డీ వస్తుంది. RD లేదా లిక్విడ్ ఫండ్స్ వంటివి దీనికి బెస్ట్.
News January 24, 2026
పేర్ని నాని – అనగాని మధ్య డైలాగ్ వార్

AP: మంత్రి అనగాని, పేర్ని నాని మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ‘సంస్కారహీనుడు, మతిస్తిమితం లేని మంత్రి రెవెన్యూ శాఖకు ఉండటం ప్రజల కర్మ. ఆయన అడిగిన రూ.25 కోట్లు జగన్ ఇచ్చుంటే ఇవాళ నా పక్కన ఉండేవారు’ అని పేర్ని నాని విమర్శించారు. అటు ‘తాడేపల్లి ప్యాలెస్ బయట తిరిగే డ్యాష్లు ఇంకా పిచ్చి మాటలు మానుకోలేదు. నా రేటేంటో వాడు చెప్పేది ఏంటి? వాడి బతుకేంటో నాకు తెలుసు’ అని అనగాని తీవ్రంగా స్పందించారు.


