News February 2, 2025
పంచాయతీ ఎన్నికలపై కీలక ప్రకటన

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఖమ్మం జిల్లా వైరా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి 15లోపే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాగా కులగణనపై ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందగా, ఈ నెల 4న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకుని ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి తొలి వారంలో ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
Similar News
News October 31, 2025
ICAR-IARIలో 18 ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ICAR-IARI(ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)లో 18 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీటిలో యంగ్ ప్రొఫెషనల్(15), సీనియర్ రీసెర్చ్ ఫెలో(3) ఖాళీలు ఉన్నాయి. నవంబర్ 6, 7 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://iari.res.in/
News October 31, 2025
సెక్స్ కుంభకోణం కేసు.. ప్రిన్స్పై కింగ్ చర్యలు

జెఫ్రీ ఎప్స్టైన్ సెక్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్ ప్రిన్స్ ఆండ్రూపై ఆయన సోదరుడు కింగ్ ఛార్లెస్-3 కఠిన చర్యలు తీసుకున్నారు. ఆండ్రూకున్న బిరుదులు, గౌరవాలు, అధికారాలను తొలగించారు. ఇంటిని ఖాళీ చేయాలని నోటీసులు పంపారు. USను కుదిపేసిన ఎప్స్టైన్ సెక్స్ కుంభకోణం బాధితురాలు గ్రిఫీ.. ఆండ్రూ తనపై 3సార్లు అత్యాచారం చేశారని ఇటీవల ఆరోపించారు. దీంతో ఆయనపై కింగ్ ఛార్లెస్-3 చర్యలు చేపట్టారు.
News October 31, 2025
భారీగా పెరిగిన బంగారం ధరలు!

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ.1,22,680కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.1,100 ఎగబాకి రూ.1,12,450గా ఉంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ. 1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే ధరలున్నాయి.


