News October 19, 2024
6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై కీలక ప్రకటన

APలో 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామక ప్రక్రియను ఐదారు నెలల్లో పూర్తి చేస్తామని DGP ద్వారకా తిరుమలరావు ప్రకటించారు. న్యాయపరమైన ఇబ్బందులను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా ఈ పోస్టులకు గత ప్రభుత్వం నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 95,206 మంది అర్హత సాధించారు. అయితే హోంగార్డులకు సివిల్, AR పోస్టుల్లో 15%, APSP పోస్టుల్లో 25% రిజర్వేషన్ ఇవ్వడంతో పలువురు హైకోర్టును ఆశ్రయించారు.
Similar News
News February 9, 2026
మంత్రులకు సీఎం CBN క్లాస్!

AP: రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై రివ్యూ సందర్భంగా CM చంద్రబాబు మంత్రులకు క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘మంత్రులంటే కేవలం పాలసీలు చేసేవాళ్లు కాదు. జనాభా పెరుగుదలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. గర్భనిరోధక ఆపరేషన్లు తగ్గించాలి. పాపులేషన్ మేనేజ్‌మెంట్‌పై అసెంబ్లీలో పాలసీ ప్రకటిస్తాం. జనాభా పెంచేందుకు ప్రోత్సాహకాలిస్తాం. APR 1 నుంచి పాలసీ ప్రణాళిక రూపొందిస్తాం’ అని చెప్పినట్లు సమాచారం.
News February 9, 2026
ఇటలీపై స్కాట్లాండ్ ఘన విజయం

T20WCలో భాగంగా ఇటలీతో జరిగిన <<19091297>>మ్యాచ్‌లో<<>> స్కాట్లాండ్ 73 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 208 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఇటలీ 16.4 ఓవర్లలో 134 స్కోరుకే ఆలౌటైంది. బెన్ మనేంటి(52), హ్యారీ మనేంటి(37), జేజే స్మట్స్(22) మినహా అందరూ విఫలమయ్యారు. స్కాట్లాండ్ బౌలర్లలో మైఖేల్ లీస్క్ 4, మార్క్ 2, బ్రాడ్ కుర్రీ, వీల్, ఒలీవర్ తలో వికెట్ తీశారు.
News February 9, 2026
సోషల్ మీడియాలో ‘Vagueposting’.. అసలేంటిది?

గతవారం Vagueposting గ్లోబల్ గూగుల్ ట్రెండులోకి రావడంతో దీనిగురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. సమయం, సందర్భం, సరైన వివరాలు, అర్థం లేకుండా బాధ, సంతోషం, కోపాన్ని వ్యక్తపరుస్తూ SMలో చేసే పోస్టులనే Vagueposting అంటారు. యూజర్లను గందరగోళంలో పడేసి వారి అటెన్షన్‌ను పొందేందుకు ఇలా చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి పోస్టులు కనిపిస్తే స్కిప్ చేయండి. దీనిగురించి ఆలోచించి టైమ్ వేస్ట్ చేసుకోవద్దు.


