News December 30, 2024
వచ్చే నెలలో కీలక ప్రకటనలు!

TG ప్రభుత్వం నూతన ఏడాదిలో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. జనవరిలో రైతు భరోసా అమలు, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. వీటికి సంబంధించి త్వరలోనే క్యాబినెట్ భేటీ నిర్ణయం తీసుకోనుంది. ఉద్యోగ నోటిఫికేషన్లపైనా ప్రకటన చేసే అవకాశముంది. దీంతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
Similar News
News October 25, 2025
అంతర పంటలతో వ్యవసాయంలో అధిక లాభం

ప్రధాన పంట వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలం వృథా కాకుండా పండించే మరో పంటను అంతర పంట అంటారు. ఈ విధానంలో ఒక పంట దెబ్బతిన్నా.. మరొకటి చేతికొస్తుంది. వాతావరణం అనుకూలిస్తే 2 పంటల నుంచి రైతు మంచి ఆదాయం పొందవచ్చు. దీని వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. కీటకాలు, తెగుళ్లు, కలుపు మొక్కల బెడద, నేలకోత తగ్గి.. భూమిలో పోషకాలు పెరిగే అవకాశం ఉంది. అంతర పంటల సాగు వల్ల వచ్చిన ఆదాయం ప్రధాన పంట పెట్టుబడికి సహాయపడుతుంది.
News October 25, 2025
ఆస్ట్రేలియా బ్యాటింగ్.. టీమ్స్ ఇవే

టీమ్ ఇండియాతో మూడో వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నితీశ్, అర్షదీప్ స్థానంలో కుల్దీప్, ప్రసిద్ధ్ జట్టులోకి వచ్చారు.
భారత్: రోహిత్ శర్మ, గిల్ (C), కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, సుందర్, ప్రసిద్ధ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, సిరాజ్
ఆస్ట్రేలియా: హెడ్, మార్ష్(C), షార్ట్, రెన్షా, కారే, కొన్నోలీ, ఓవెన్, నాథన్ ఎల్లిస్, స్టార్క్, జంపా, హేజిల్వుడ్.
News October 25, 2025
ముగిసిన చంద్రబాబు దుబాయ్ పర్యటన

AP: మూడు రోజుల దుబాయ్ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు ఇవాళ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా ఆయన పర్యటన సాగింది. ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో కీలక సమావేశాల్లో సీఎం చంద్రబాబు బృందం పాల్గొంది. నవంబర్ 14, 15న విశాఖలో జరగనున్న CII ఇన్వెస్టర్స్ మీట్కు వారిని ఆహ్వానించింది. నిన్న గల్ఫ్ దేశాల్లో ప్రవాసాంధ్రులతోనూ సీఎం సమావేశమైన సంగతి తెలిసిందే.


