News August 2, 2024
ఆరోగ్యశ్రీలో కీలక మార్పులు(1/2)

AP: ట్రస్టు విధానంలో కొనసాగుతోన్న ఆరోగ్యశ్రీ(NTR వైద్య సేవ) సేవలు ఇకపై బీమా పరిధిలోకి మారనున్నాయి. మంత్రి సత్యకుమార్ ఆదేశాలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం రోగులకు అందించిన చికిత్సకు తగ్గట్లుగా ఆస్పత్రులకు ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తోంది. దీనివల్ల ఒక్కోసారి బకాయిలు పేరుకుపోతున్నాయి. బీమా విధానంలో హెల్త్ కార్డులు ఉన్న వారు దేశవ్యాప్తంగా ఉచిత చికిత్స పొందే అవకాశం ఉంటుందట.
Similar News
News November 20, 2025
₹600Crతో TG పోలీసు AMBIS అప్గ్రేడ్

TG పోలీస్ శాఖ నేర పరిశోధన వేగాన్ని పెంచేందుకు ఆటోమేటెడ్ మల్టీమోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్(AMBIS)ను అప్గ్రేడ్ చేస్తోంది. పాతబడిన సర్వర్లు, స్టోరేజ్ స్థానంలో లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ₹600Cr మంజూరు చేసింది. ఈ వ్యవస్థ అన్ని PSలలోని పరికరాలను లింక్ చేస్తుంది. AI సాయంతో సెకన్లలోనే బయోమెట్రిక్ మ్యాచింగ్ పూర్తవుతుంది.
News November 20, 2025
మొక్కజొన్నలో పాము పొడ తెగులును ఎలా గుర్తించాలి?

పాము పొడ తెగులు ముందుగా నేలకు దగ్గరగా ఉండే మొక్కజొన్న మొక్కల కింది ఆకులపై సోకుతుంది. తర్వాత పై ఆకులకు, కాండానికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన మొక్కల ఆకులు, కాండంపై బూడిద, గోధుమ వర్ణపు మచ్చలు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి.. చూడటానికి పాముపొడ వలే కనిపిస్తాయి. కాండంపై ఏర్పడిన తెగులు లక్షణాల వల్ల కణుపుల వద్ద మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి. దీని వల్ల మొక్కల సంఖ్య తగ్గి పంట దిగుబడి పడిపోతుంది.
News November 20, 2025
చలికాలం స్నానం చేయడం లేదా?

చలి విపరీతంగా పెరగడంతో చాలామంది స్నానం చేసేందుకు ఇష్టపడరు. ఎంత వేడినీటితో షవర్ చేసినా తర్వాత చలివేస్తుందంటూ స్నానానికి దూరంగా ఉంటున్నారు. కొందరైతే రోజుల తరబడి స్నానం చేయడంలేదు. అయితే ఇది మంచిది కాదంటున్నారు వైద్యులు. స్నానం చేయకపోతే శరీరంపై చెమట పేరుకుపోయి అలర్జీలకు దారి తీస్తుందట. అలాగే చర్మం నుంచి దుర్వాసన వచ్చి ఇతరుల దృష్టిలో చులకన అవుతారు. నిత్యం తప్పనిసరిగా స్నానం చేయాలి.


