News April 15, 2025

ట్రాఫిక్ చలాన్ల జారీలో కీలక మార్పులు!

image

వాహనదారులకు విధించే చలాన్లపై కేంద్రం కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP)ని తీసుకొచ్చింది. చలాన్లు విధించే ఆటోమేటెడ్ కెమెరాలు కనీసం 10 సెకన్ల ఫుటేజ్‌ను రికార్డ్ చేయాలని ఆదేశించింది. ట్రాఫిక్ చలాన్ల అమలులో పారదర్శకతను పెంచేందుకు ఈ చర్యకు సిద్ధమైనట్లు తెలిపింది. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే 1-10 సెకన్ల వీడియోతో పాటు, టైమ్, లొకేషన్ చూపేలా చలాన్‌లో స్పష్టంగా కనిపించాలని తెలిపింది.

Similar News

News December 4, 2025

ఇతిహాసాలు క్విజ్ – 86 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: పార్వతీ దేవి అవతారంగా, శక్తి స్వరూపిణిగా, విష్ణుమూర్తి సోదరిగా పరిగణించబడే, ఈశ్వరుడు వివాహం చేసుకున్న దేవత ఎవరు? అలాగే, ఆమెకు తమిళనాడులో ఒక ప్రసిద్ధ ఆలయం కూడా ఉంది. ఆమెతో పాటు ఒక పచ్చ చిలుక కూడా కనిపిస్తుంది.
సమాధానం: మధుర మీనాక్షి అమ్మవారు. ఈ దేవత ఆలయం తమిళనాడు రాష్ట్రంలోని మధురలో ఉంది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 4, 2025

బొగ్గు గనుల నుంచి విష వాయువులు

image

ఝార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా కేందౌది బస్తీ ప్రాంతంలోని బొగ్గు గనుల నుంచి విష వాయువులు వెలువడుతున్నాయి. ఇప్పటికే స్థానికంగా ఒక మహిళ మరణించగా 12 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అధికారులు ఆ ప్రాంతంలోని 1000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. డేంజర్ జోన్లో ఉన్న ఇతర ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. 3 అంబులెన్సులను ఈ ప్రాంతంలో అందుబాటులో ఉంచినట్లు తవ్వకాలు జరుపుతున్న BCCL ప్రతినిధి తెలిపారు.

News December 4, 2025

రేపు పిడుగులతో కూడిన వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి తిరుపతి(D) చిట్టమూరులో 88.5mm, చింతవరంలో 81mm, నెల్లూరులో 61mm, పాలూరులో 60mm వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.