News April 10, 2025
గ్రామ, వార్డు సచివాలయాల్లో కీలక మార్పులు

AP: గ్రామ, వార్డు సచివాలయాలను A, B, C కేటగిరీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. 2500లోపు జనాభా ఉన్న సచివాలయానికి ఇద్దరు, 2501-3500 జనాభా ఉన్న సచివాలయానికి ముగ్గురు, 3501కి పైగా జనాభా ఉన్న సచివాలయానికి నలుగురు సిబ్బందిని కేటాయించింది. రియల్ టైమ్‌లో పౌరసేవలు అందించేలా సిబ్బందికి విధులు అప్పగించింది.
Similar News
News February 2, 2026
ఒక్క నిర్ణయంతో ₹10 లక్షల కోట్ల నష్టం.. కానీ మన మంచికే!

బడ్జెట్లో డెరివేటివ్స్‌పై సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ టాక్స్ (STT) పెంచడంపై CEA వి.అనంత నాగేశ్వరన్ క్లారిటీ ఇచ్చారు. F&O ట్రేడింగ్‌లో జనం భారీగా డబ్బు పోగొట్టుకుంటున్నట్లు SEBI రిపోర్ట్స్ చెబుతున్నాయని, ఈ స్పెక్యులేటివ్ బెట్స్‌ను అరికట్టి హౌస్‌హోల్డ్ సేవింగ్స్‌ని కాపాడడమే తమ ఉద్దేశమని వివరించారు. STT పెంపుతో నిన్న స్టాక్ మార్కెట్లు కుప్పకూలి ఇన్వెస్టర్లు దాదాపు ₹10 లక్షల కోట్ల మేర నష్టపోయారు.
News February 2, 2026
HLL లైఫ్‌కేర్ లిమిటెడ్‌లో 39 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

HLL లైఫ్‌కేర్ లిమిటెడ్ 39 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తుకు జనవరి 28 ఆఖరు తేదీ కాగా.. ఫిబ్రవరి 8 వరకు పొడిగించారు. పోస్టును బట్టి BSc, BTech, CA, MSc, MBA/PGDM, MCA, MHA, MPH, BPMT, PGDMLT, MLT అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.20,000-రూ.2,20,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.lifecarehll.com
News February 2, 2026
మిద్దె తోటల్లో ఈ జాగ్రత్తలతో మేలు

☛ సేంద్రియ ఎరువులైన పేడ, వేప పిండి వాడితే మట్టిసారం పెరిగి కూరగాయలు ఎక్కువగా పండుతాయి. ☛ ఎత్తుగా పెరిగే, కాండం అంత బలంగా లేని మొక్కలకు కర్రతో ఊతమివ్వాలి. ☛ తీగజాతి మొక్కల కోసం చిన్న పందిరిలా ఏర్పాటు చేసుకోవాలి. ☛ మట్టిలో తేమను బట్టి నీరివ్వాలి. ☛ మొక్కలకు కనీసం 4 గంటలైనా ఎండ పడాలి. ☛ చీడపీడల నివారణకు లీటరు నీటిలో 5ml వేప నూనె వేసి బాగా కలిపి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చేయాలి.


