News November 15, 2024
బంగ్లా రాజ్యాంగానికి కీలక మార్పులు!

రాజ్యాంగం నుంచి సెక్యులరిజం, సోషలిజంను తొలగించాలని బంగ్లా AG అసదుజ్జమాన్ ప్రతిపాదించారు. అవామీ లీగ్ ప్రభుత్వం చేసిన 15వ రాజ్యాంగ సవరణ లౌకికవాదాన్ని ప్రాథమిక సూత్రంగా పునరుద్ధరించడం సహా షేక్ ముజీబుర్ రెహ్మాన్ను జాతిపితగా గుర్తిస్తోంది. దీన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. కేసు విచారణ సందర్భంగా 15వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ విరుద్ధమని తమ ప్రభుత్వం ప్రకటించాలనుకుంటోందని AG అన్నారు.
Similar News
News November 17, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

నేటి నుంచి ఎల్లుండి ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు తెల్లవారుజామున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్లో చలి తీవ్రత ఉంటుందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

హనుమాన్ చాలీసా భావం – 12

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ||
హనుమంతుడు చేసిన సాయానికి రాముడు ఆయనను ఎంతో మెచ్చుకున్నారు. ‘నీవు నాకు నా ప్రియమైన తమ్ముడైన భరతునితో సమానమైన ఆప్తుడివి’ అని ప్రకటించారు. ఇది ఆంజనేయుడి సేవ, నిస్వార్థ భక్తికి శ్రీరాముడు ఇచ్చిన గుర్తింపు. నిజమైన సేవకు, భక్తికి దేవుడి అనుగ్రహం, అపారమైన గౌరవం దక్కుతాయనడానికి ఇదే నిదర్శనం. <<-se>>#HANUMANCHALISA<<>>