News October 24, 2024
VROలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

TG: రాష్ట్ర ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గ్రామాల్లో త్వరలోనే మళ్లీ వీఆర్వోలను నియమించేందుకు కసరత్తులు చేస్తోంది. మంత్రి పొంగులేటి సైతం తాజాగా ఇదే విషయం చెప్పారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిందని, త్వరలోనే గ్రామానికో వీఆర్వోను నియమిస్తామని అన్నారు.
Similar News
News February 15, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 15, 2026
గూడెబెల్లూర్ నుంచి మహబూబ్నగర్ దాకా NH-167 విస్తరణ: మోదీ

TG: హైదరాబాద్-పనాజీ ఎకనమిక్ కారిడార్లో భాగంగా గూడెబెల్లూర్ నుంచి మహబూబ్నగర్ వరకు NH-167ను 4 వరుసలుగా విస్తరించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. దీనిపై PM మోదీ తెలుగులో ట్వీట్ చేశారు. ‘NH-167 విస్తరణ నిర్ణయం ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ఉపాధి అవకాశాలు సృష్టించి, ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తుంది’ అని పేర్కొన్నారు. 80KM పొడవైన ఈ ప్రాజెక్టుకు ₹3,175 కోట్లు ఖర్చవుతుందని అంచనా.
News February 15, 2026
బంగ్లా ఎన్నికల్లో ఓ సీటు గెలిచిన ‘BJP’!

బంగ్లాదేశ్ ఎన్నికల్లో BJP ఓ సీటు గెలుచుకుంది. మీరు చదివింది నిజమే. కాకపోతే అక్కడున్నది బంగ్లాదేశ్ జాతీయ పార్టీ(BJP). భోలా-1 నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థి అందలీవె రహ్మాన్ పార్థో విజయం సాధించారు. దేశంలో 297 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో BNP 209 సీట్లు <<19125261>>దక్కించుకోవడం<<>> తెలిసిందే. ఇక జమాత్ కూటమి 77 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు <<19132575>>జులై ఛార్టర్<<>>కు అనుకూలంగా ఏకంగా 70 శాతం మంది ఓటు వేశారు.


