News January 1, 2025
రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

TG: విద్యార్థుల ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు కేటాయించిన జిల్లాల్లో ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలను అదనపు కలెక్టర్లకు అప్పగించింది. బాలికల వసతి గృహాల్లో మహిళా ఐఏఎస్లు నిద్ర చేసి, వసతులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తరచూ తనిఖీలతో పాటు కలెక్టర్లు నెలవారీ సమీక్షలు నిర్వహించాలని పేర్కొంది.
Similar News
News December 1, 2025
తిరుమలలో సహస్ర నామార్చన ఆంతర్యం

తిరుమల శ్రీవారి ఆలయంలో తోమాలసేవ తర్వాత జరిగే ముఖ్య కైంకర్యం సహస్ర నామార్చన. ఇందులో స్వామివారిని 1008 నామాలతో పూజిస్తారు. ఈ నామాల ద్వారా శ్రీమహావిష్ణువు సకల వైభవాలను కీర్తిస్తారు. సకల దుఃఖాలను తొలగించేది, శుభాలను ప్రసాదించేది శ్రీమహావిష్ణువే అనే భావనతో ఈ అర్చన జరుగుతుంది. భక్తులు ఆర్జితసేవ టికెట్ల ద్వారా ఈ పవిత్రమైన అర్చనలో పాల్గొని, స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 1, 2025
NINలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్(NIN)లో 3 ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3, 2 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. బీఎస్సీ(నర్సింగ్, న్యూట్రీషన్, డైటెటిక్స్, హోమ్ సైన్స్, పబ్లిక్ హెల్త్ న్యూట్రీషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు mmp_555@yahoo.comకు దరఖాస్తును పంపాలి. projectsninoutsourcing@gmail.comలో సీసీ పెట్టాలి. వెబ్సైట్: https://www.nin.res.in
News December 1, 2025
రాజ్ నిడిమోరు గురించి తెలుసా?

రాజ్ నిడిమోరు తిరుపతిలో (1979) జన్మించారు. SVUలో కంప్యూటర్ సైన్స్లో బీటెక్ చేశారు. USలో ఉద్యోగం చేశారు. సినిమా కల నెరవేర్చుకునేందుకు ఫిల్మ్ మేకింగ్లోకి అడుగుపెట్టారు. 2002లో షాదీ.కామ్ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్తో ఫేమస్ అయ్యారు. ఆ సిరీస్ సీజన్-2లో సమంత నటించారు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగినట్లు సమాచారం. తాజాగా వారు ఒక్కటయ్యారు.


